లైంగిక దాడిపై కేసు నమోదు

18 Apr, 2020 09:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మృత శిశువుకు జన్మనిచ్చిన బాలిక  

నిందితుడు కూడా మైనరే.. 

జరుగుమల్లి (సింగరాయకొండ): మండల కేంద్రంలోని తూర్పు ఎస్సీ కాలనీకి చెందిన  మైనర్‌ బాలికను అత్యాచారం చేసిన ఘటనలో అదే కాలనీకి చెందిన బాలుడిపై గురువారం అర్ధరాత్రి జరుగుమల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పు ఎస్సీ కాలనీకి చెందిన మైనర్‌ బాలిక ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, అదే కాలనీకి చెందిన బాలుడు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరు 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. అయితే ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న తల్లిదండ్రులు అబార్షన్‌ చేయించడానికి ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రికి ఈనెల 6వ తేదీ వెళ్లారు.

అయితే ఆస్పత్రి వైద్యులు బాలికను పరీక్షించి ఏడు నెలల గర్భం అని ఈ సమయంలో అబార్షన్‌ చేస్తే ప్రమాదం అని చెప్పడంతో అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి ఈనెల 8వ తేదీ తరలించారు. బాలిక 9వ తేదీ చనిపోయిన శిశువుకు జన్మించింది. తరువాత వారిని ఆస్పత్రి నుంచి 13వ తేదీ డిశ్చార్జ్‌ చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారం 16వ తేదీ రాత్రి నిందితుడైన బాలుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ యు. శ్రీనివాసరావు వివరించారు. 

బాలికపై లైంగిక దాడి
దర్శి: మండల పరిధిలో పదకొండు సంవత్సరాల వయస్సున్న బాలికపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి చేసిన ఘటన కొర్లమడుగు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసు తెలిపిన వివరాల మేరకు.. బాలిక తల్లిదండ్రులు పొలం వెళ్లారు. గురువారం మధ్యాహ్నం తన ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను నిందితుడు ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. దుస్తులకు రక్తం కావడంతో బాలిక ఏడ్చింది.

దీంతో ఇంట్లో చెప్తే చంపేస్తానని బెదిరించాడు. భయపడిన బాలిక గురువారం సాయంత్రం వరకు ఇంట్లో చెప్పలేదు. బాలిక తరచూ బాత్‌రూంకు వెళ్లి బయటకు వచ్చి ఏడుస్తుండటంతో గమనించిన తల్లి అడగటంతో ఆమెకు జరిగిన విషయం చెప్పింది. రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు విషయం చెప్పి..పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై ఆంజనేయులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా