అఖిలప్రియ భర్త భార్గవ్‌పై పోలీస్‌ కేసు

3 Oct, 2019 14:17 IST|Sakshi

సాక్షి, కర్నూలు : మాజీమంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌ రామ్‌పై ఆళ్లగడ్డ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఆళ్లగడ్డలో ఉన్న క్రషర్‌ క్వారీ ఫ్యాక్టరీ వివాదంలో యజమాని శివరామిరెడ్డి ఫిర్యాదు మేరకు భార్గవ్‌ రామ్‌తో సహా 10మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా క్రషర్‌ ఇండస్ట్రీ పూర్తిగా తమకే ఇవ్వాలని అఖిలప్రియ భర్త బెదిరింపులకు పాల్పడటంతో శివరామిరెడ్డి పోలీసుల్ని ఆశ్రయించాడు. మరోవైపు అఖిలప్రియ, భార్గవ్‌ రామ్‌ల పీఏ మహేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కేసు నమోదు అయిన వారి వివరాలు..

1.మద్దూరు భార్గవ్ రామ్ నాయుడు
2. మాదల శ్రీను
3.నాగిరెడ్డి పల్లె శేఖర్ రెడ్డి
4.శ్రీను
5.అల్లా సుబ్బయ్య
6.నాగేంద్ర
7.డ్రెవర్ గణేష్
8.మంగలి పవన్
9. మహేష్ (పీఏ)
10.సంపత్ నాని
11.షరీఫ్

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా