కలకలం రేపిన చోరీ: ఆ దొంగ దొరికాడు!

31 Dec, 2019 12:38 IST|Sakshi

సాక్షి, కారంచేడు: బాపట్ల మాజీ ఎంపీ, మూవీ మొఘల్‌ దివంగత డాక్టర్‌ దగ్గుబాటి రామానాయుడు ఇంట్లో జరిగిన దొంగతనం కేసును కారంచేడు పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి.. అతడి వద్ద నుంచి రూ. 3 లక్షల 60వేల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కారంచేడు నడిబొడ్డు చినవంతెన సెంటర్‌ లైబ్రరీ బజారులో సినీ నిర్మాత, మూవీ మోఘల్‌గా పేరొందిన గ్రామానికి చెందిన డాక్టర్‌ దగ్గుబాటి రామానాయడు ఇంట్లో ఇటీవల దొంగలు పడిన సంగతి తెలిసిందే. రామానాయుడు ఇంట్లో ప్రస్తుతం ఆయన సోదరుడు దగ్గుబాటి రామ్మోహన్‌రావు (మోహన్‌బాబు) నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తెలు హైదరాబాద్‌లో ఉంటుండటంతో దంపతులు తరుచూ హైదరాబాద్‌ వెళ్లి వారం, పది రోజులు ఉండి వస్తుంటారు.

అదే క్రమంలో ఈ నెల 16వ తేదీన మోహన్‌బాబు దంపతులు హైదరాబాద్‌ వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దొంగలు రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో పనులు చేసే నరసింహారావు, సుజాత దంపతులు శనివారం ఉదయం వచ్చి చూడగా ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి గ్రామంలోనే ఉండే ఆఫీస్‌ మేనేజర్‌ తాళ్లూరి శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే అన్ని బీరువాలు, అరమరలు పగులగొట్టి ఉండటంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. చీరాల రూరల్‌ సీఐ జె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు నుంచి క్లూస్‌ టీమ్‌తో పాటు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. విషయం తెలిసిన సినీ నిర్మాత, నటుడు, మోహన్‌బాబు బావమరిది కొల్లా అశోక్‌కుమార్‌ వచ్చి పోలీసులకు వివరాలు అందించారు.

మరిన్ని వార్తలు