ఖమ్మంలో భారీగా పట్టుబడ్డ పాత నోట్ల కట్టలు

31 Oct, 2019 11:33 IST|Sakshi

సాక్షి, ఖమ్మం :  జిల్లాలోని వేంసూరు మండలంలో పోలీసులు నిర్వహించిన సోదాలో ఓ ఇంట్లో భారీగా పాత నోట్ల కట్టలు బయటపడ్డాయి. వివరాలు.. వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో నడిపల్లి దామెదర్‌ ఇంటిని కొన్ని రోజల క్రితం ఓ వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఇంట్లో రూ.12లక్షల పాత కరెన్సీని రూ.500, రూ.1000 నోట్లు పెట్టి మధ్యలో తెల్ల కాగితాలు పెట్టి భారీగా నిల్వచేశాడు. వీటిని కంటెయినర్‌లో అమర్చే విధంగా పెద్ద బాక్స్‌లాగా అమర్చాడు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందగా బుధవారం సదరు వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు.

ఈ క్రమంలో అధిక మొత్తంలో పాత కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసు​కున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దున మర్లపాడు గ్రామం ఉండటంతో దొంగనోట్ల మార్పిడికి ఈ గ్రామాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అలాగే సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో సుమారు రూ. 100 కోట్ల మేర ఇలాంటి కరెన్సీ ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. ఇటీవలే ఈ వ్యక్తిపై సత్తుపల్లిలో దొంగనోట్ల ముఠాలోని కేసులో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, పాత కరెన్సీ నిల్వ చేసిన ఇంటిని కల్లూరు ఏసీపీ వెంకటేశ్, వేంసూరు ఎస్‌ఐ నరేశ్‌ పరిశీలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కీర్తి, శశికుమార్‌తో పాటు బాల్‌రెడ్డిని కూడా..

తండ్రిని చంపిన కొడుకు, కోడలు

నాన్నా నన్ను క్షమించు..  

బోగస్‌ ట్రావెల్‌ ఏజెన్సీ గుట్టురట్టు

పోలీస్‌ వాహనాన్ని ఢీకొట్టిన కారు

గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌లో అగ్నిప్రమాదం

‘ట్రిమ్‌విజన్‌’ పేరిట 230 మందికి టోకరా

ప్రాణాలు తీసిన కోడి పందెం

విషాదం : కాలిపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు

ఆర్టీసీ సమ్మె: ఆరెపల్లిలో విషాదం

స్పిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

మహిళలకు అసభ్య వీడియో, ఎస్‌ఐపై వేటు

కైలాసగిరిపై గ్యాంగ్‌రేప్‌ యత్నం

టపాసులకు భయపడి పట్టాలపైకి

లారీలు, బస్సులున్నాయి ఇంకా పెళ్లికాలేదని..

కడసారి చూపు కోసం వెళ్లి...అంతలోనే!

ఆర్టీసీ బస్‌ ఢీకొని కండక్టర్‌ మృతి

మోసం కేసులో సినీ నిర్మాత అరెస్ట్‌

క్రిమినల్‌ ప్లాన్‌! అప్రైజరే నిందితుడు

మంచానికి కట్టేసి.. నిప్పంటించి..

ఓటీపీ లేకుండానే ఓవర్సీస్‌ దోపిడీ

మరిదిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సోనాలి

కీర్తి దిండు పెట్టగా.. శశి గొంతు నులిమాడు

ఫ్రెండ్‌ భార్యపై లైంగిక దాడి ఆపై..

యూట్యూబ్‌లో చూసి నేర్చుకొని ఆపై....!

నకిలీ దందాకు చెక్‌..13 మంది అరెస్టు

ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

వేధింపులు తాళలేక.. నవవధువు ఆత్మహత్య

23 రోజులుగా మృత్యువుతో పోరాడి.. చివరికి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి

ప్రిన్స్‌ ఇంట ‘బాయిదూజ్‌’ సంబరం

ఓ పెద్ద దిక్కుని కోల్పోయాం : న‌రేష్‌

బిడ్డ సరే... మరి నీ భర్త ఎక్కడ?

ప్రకాశ్‌రాజ్‌ను బహిష్కరించాలి

సీనియర్‌ నటి గీతాంజలి కన్నుమూత