కిడ్నాప్‌.. ఆపై పెళ్లి

30 Dec, 2019 02:56 IST|Sakshi

శాంతినగర్‌ (అలంపూర్‌): బాలికను కిడ్నాప్‌ చేసి.. పెళ్లి చేసుకొని మూడున్నరేళ్లుగా సికింద్రాబాద్‌లో మకాం పెట్టాడు. ఈ క్రమంలో వారికి పాప జన్మించింది. ఆధార్‌ కార్డు ఆధారంగా చిరునామా తెలుసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌కు చెందిన షఫీ ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు డ్రైవర్‌. ఆ సమయంలో బాలికకు (14) మాయ మాటలు చెప్పి 2016 ఏప్రిల్‌ 26న హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధార్‌ కార్డు ఆధారంగా మూడున్నరేళ్ల తర్వాత కేసు ఛేదించారు.

మరిన్ని వార్తలు