విధుల్లోనే మృత్యుఒడిలోకి 

13 Dec, 2019 08:26 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు, మనోజ్‌ కుమార్‌ (ఫైల్‌)  

 గుండెపోటుతో యువ కానిస్టేబుల్‌ మృతి

కౌటాల పోలీస్‌స్టేషన్‌లో సంఘటన 

సాక్షి, కౌటాల(సిర్పూర్‌): కౌటాల మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో సివిల్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్‌ మనోజ్‌ కుమార్‌(27) గురువారం వేకువ జామున గుండెపోటుతో మృతి చెందినట్లు సిర్పూర్‌(టి) ఎస్సై ఎస్‌. వెంకటేశ్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మనోజ్‌ బుధవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో పహార (వాచ్‌) డ్యూటీలో ఉన్నాడు. రాత్రి 11 గంటల వరకు తోటి పోలీసులతో సంతోషంగా విధులు నిర్వర్తించాడు. విధుల అనంతరం మనోజ్‌ నిద్రపోయాడు. గురువారం ఉదయం హెడ్‌కానిస్టేబుల్‌ రమేష్‌ నిద్రలో ఉన్న మనోజ్‌ను పిలవగా మనోజ్‌ స్పందించకపోవడంతో అనుమానం వచి్చన అతను కౌటాల సీఐకు సమాచారం అందించారు. దీంతో కౌటాల సీఐ బి. శ్రీనివాస్‌ మనోజ్‌ను పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే మనోజ్‌ను సిర్పూర్‌(టి)లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మనోజ్‌ స్వస్థలం కెరమెరి మండలంలోని దేవపూర్‌ గ్రామం. మనోజ్‌కు భార్య జీవిత ఉన్నారు.  

కానిస్టేబుల్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం 
సిర్పూర్‌(టి): కానిస్టేబుల్‌ మనోజ్‌ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. సిర్పూర్‌ సామాజిక ఆసుపత్రిలో కానిస్టేబుల్‌ మనోజ్‌ కు టుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని వారికి తెలిపారు. 15 రోజు ల్లో కుటుంబ సభ్యు ల్లో ఒకరికి ఉద్యోగం కలి్పస్తామని తెలిపారు. ఆయనతో ఏఎస్పీ సుదీంధ్ర, డీఎస్పీ స్వామి, సీఐ శ్రీనివాస్, ఎస్సై వెంకటేష్‌ ఉన్నారు. 

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
కెరమెరి(ఆసిఫాబాద్‌): విధి నిర్వాహణలో గుండెపోటుతో మృతి చెందిన మనోజ్‌ కుమార్‌ అంత్యక్రియలను పోలీసులు అధికార లాంఛనాలతో దేవాపూర్‌లో జరిపారు. ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ సురేశ్‌ కుమార్, ఆర్‌ఐ ఎం. శ్రీ నివాస్, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు రమేశ్, వెంకటేశ్, నాజర్‌ హుస్సేన్, అమీరోద్దిన్‌ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా