మధు మృతిపై ముమ్మర విచారణ

24 Apr, 2019 11:23 IST|Sakshi
మధు రాసిన డెత్‌ నోట్‌ ,ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు

రాయచూరుకు ఫోరెన్సిక్‌ బృందం  

సంఘటనాస్థలంలో మరోసారి తనిఖీ  

‘సూసైడ్‌ నోట్‌’ సేకరణ  

రాయచూరు రూరల్‌: ఇంజనీరింగ్‌ విద్యార్థిని మధు పత్తార్‌ (23) అనుమానస్పద మృతి కేసు దర్యాప్తునకు సీఐడీ అధికారుల బృందంతో పాటు  ఫోరెన్సిక్‌ బృందం రాయచూరులో పర్యటించింది. సోమవారం సాయంత్రం సీఐడీ ఎస్పీ శరణప్ప, డీఎస్పీ రవి శంకర్, సీఐ దిలీప్‌ కుమార్, నలుగురు అధికారులతో కూడిన బృందం రాయచూరుకు వచ్చింది. మంగళవారం ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందం విచ్చేసింది. నగరంలో మాణిక్‌ ప్రభు దేవాలయం వెనుక ఉన్న సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. మధును హత్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పూర్తి విచారణ చేస్తున్నారు. ఆమె సూసైడ్‌ నోట్‌గా చెబుతున్న లేఖను పోలీసుల నుంచి తీసుకున్నారు. తమ కూతురిని హత్యేనని తల్లిదండ్రులు రేçణుక, నాగరాజ్‌లు అధికారులకు తెలిపారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకొనే వ్యక్తి కాదని అన్నారు.   

అంతటా సంతాపాలు   
మధు మృతి పట్ల రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో కూడా మధుకు న్యాయం చేయాలని కోరుతూ సంతాప సూచనలు, ప్లకార్డుల ద్వారా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. బాగల్‌కోట, మస్కి, బెంగళూరు, మలేషియాలో ఉంటున్న పలువురు మధు మద్దతుదారులు కొవ్వొత్తులు వెలిగించి సంతాపం ప్రకటించారు. 

మరిన్ని వార్తలు