సమత కేసులో చార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు

14 Dec, 2019 20:32 IST|Sakshi

కోర్టుకు సమర్పించిన పోలీసులు

సాక్షి, ఆసిఫాబాద్‌: సమతను అత్యాచారం చేశాక గొంతుకోసి చంపారని పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఫోరెన్సిక్‌ పరీక్షల్లో ఈ విషయం తేలిందన్నారు. అలాగే నిందితుల వీర్యానికి సంబంధించిన డీఎన్‌ఏ నివేదిక కోర్టుకు సమర్పించారు. శనివారం కుమురం భీం జిల్లా పోలీసులు ఆదిలాబాద్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో 44 మంది సాక్షులను గుర్తించగా, ఏ1గా షేక్‌బాబా, ఏ2 షేక్‌ షాబొద్దీన్‌, ఏ3 షేక్‌ ముఖ్దూమ్‌గా పేర్కొన్నారు. ఇక కేసు విచారణ సోమవారం నుంచి రోజువారీగా కొనసాగనుంది. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలో ని ఓ గ్రామానికి చెందిన దళిత మహిళ గత నెల 24న కుమురం భీం జిల్లా లింగాపూర్‌ మండ లం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురై న విషయం తెలిసిందే. 27న నిందితులను అరె స్టు చేశారు. దిశ ఘటనకు మూడు రోజుల ముం దు ఈ దారుణం జరిగింది. అయితే దిశ తరహా లో మొదట ప్రాధాన్యత దక్కకపోవడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తర్వాత ప్రభుత్వం స్పందించి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 

మరిన్ని వార్తలు