మైనర్‌ బాలిక కిడ్నాప్‌ కథ సుఖాంతం

27 Jul, 2019 08:06 IST|Sakshi
బాలిక కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు పవన్‌కుమార్‌ను అరెస్టు చూపుతున్న ఎస్‌ఐ ప్రసాద్‌   

ప్రధాన నిందితుడి అరెస్టు 

బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

సాక్షి, రొంపిచెర్ల : సంచలనం సృష్టించిన బాలిక కిడ్నాప్‌ కేసును రొంపిచెర్ల పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. రొంపిచెర్ల క్రాస్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మండలంలోని రామచంద్రాపురం కాలనీకి చెందిన బాలిక(14)ను బెంగళూరులో డ్యాన్స్‌ మాస్టర్‌గా పనిచేస్తున్న చిన్నగొట్టిగల్లుకు చెందిన పవన్‌కుమార్‌(24) తన తమ్ముడు సాయికుమార్‌(19) స్నేహితులు గోవిందరాజులు(23),రమ్య(22)తో కలసి ఈ నెల 20న రొంపిచెర్లలో కిడ్నాప్‌ చేయడం విదితమే. ఇక్కడి నుంచి బైక్‌లో బెంగళూరుకు.. ఆపై అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్, ఆ తర్వాత కోయంబత్తూరుకు నిందితుడు బాలికను తీసుకెళ్లడం తెలిసిందే. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రసాద్‌ కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వెంటాడుతుండడం, కిడ్నాప్‌ విషయంలో తనకు సహకరించిన వారిలో ముగ్గురిని పోలీసులు అప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలుసుకున్న పవన్‌కుమార్‌ పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతోకాలం సాగవని గ్రహించాడు.

బాలికను గుట్టుగా రొంపిచెర్లలో వదలి జంప్‌ అవ్వాలని భావించాడు.  శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రొంపిచెర్ల క్రాస్‌లోని చెక్‌పోస్టు వద్ద బాలికతో వస్తుండగా పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఇప్పటికే పవన్‌కుమార్‌పై నిర్భయ, ఫోక్సా చట్టం కింద కేసు నమోదు చేయడం తెలిసిందే. అనంతరం పీలేరు కోర్టులో అతడిని హాజరుపరచగా జడ్జి 15 రోజులు రిమాండ్‌కు ఆదేశించినట్లు ఎస్‌ఐ ప్రసాద్‌  తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితురాలు రమ్యను కూడా త్వరలో అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. ఇదలా ఉంచితే, బాలికకు డ్యాన్స్‌ అంటే ఇష్టం కావడం..పవన్‌ కుమార్‌ ఆ బాలిక చదువుతున్న స్కూలులో నృత్య ప్రదర్శన చేయడంతో కలిగిన పరిచయం ఇంతవరకూ దారితీసింది. మరోవైపు ఏఎస్‌ఐ రఘు, కానిస్టేబుళ్లు జైనుద్దీన్, ఇమ్రాన్‌ వెంటబడడంతో నిందితుడు తప్పించుకోలేకపోయాడు. ఐదు రోజులుగా ఈ కేసు పలు మలుపులు తిరిగి ఎట్టకేలకు సుఖాంతమైంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తల్లి పేరున ఇన్సూరెన్స్‌ కట్టి హత్య...

ఆరూష్‌ ఎక్కడ?

ఒక భర్త... నలుగురు భార్యలు

హైకోర్టులో కోడెల కుమార్తెకు చుక్కెదురు

పిన్నికి నిమ్మరసంలో నిద్రమాత్రలు కలిపి..

దొంగను పట్టించిన 'చెప్పు'

భార్యను కాల్చబోతే...తల్లి మృతి

లాటరీ పేరిట రూ.70 లక్షల మోసం

ప్రియుడ్ని బెదిరించిన ప్రియురాలి మేనమామ

యువతి కిడ్నాప్‌; కీలక ఆధారాలు లభ్యం..!

ఉద్యోగాలిప్పిస్తానని.. ఉడాయించాడు

తాళం వేసిన ఇళ్లే వీరి టార్గెట్‌

ఇది కథ కాదు..బిచ్చగాడి ముసుగులో 

వేర్వేరు చోట్ల.. వ్యక్తుల అదృశ్యం

వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని..

రెచ్చగొట్టే పాట : సింగర్‌ అరెస్టు

రౌడీషీటర్‌ కారసాని హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు!

కట్టుకున్నోళ్లే కడతేర్చారు

స్మగ్లింగ్‌ స్పెషలిస్ట్‌

దళిత సేవలో నాలుగో సింహం

ఎస్‌ఐ బైక్‌నే కొట్టేశార్రా బాబూ!

మాటల్లో దించి కారులో..

యువతి వేధిస్తోందని...

బెదిరించడం.. దోచుకెళ్లడం

కన్నా.. కనిపించరా..!

‘చనిపోవాలని ఉంది.. మిస్‌ యూ ఫ్రెండ్స్‌’

బీహార్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోల మృతి

నైజీరియన్ల అక్రమ దందాకు తెర

షాద్‌నగర్‌ కేసులో రామసుబ్బారెడ్డికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్‌

వంశీ కేసులో కొత్త కోణం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గ్యాంగ్‌స్టర్‌ గానా బజానా!

రీమేక్‌ క్వీన్‌

రాజమండ్రికి పోదాం!

మిస్టర్‌ బచ్చన్‌ పాండే

మంచి కంటెంట్‌ ఉన్న సినిమా

అందరూ ఆలోచించేలా...