శాస్త్రవేత్త హత్య కేసు : కొనసాగుతున్న విచారణ

2 Oct, 2019 15:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో పనిచేస్తున్న శాస్త్రవేత్త శ్రీధరణ్‌ సురేష్‌ (56) అమీర్‌పేటలో మంగళవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.  ఈ కేసు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతుంది. 48 గంటలు గడిచినా.. కేసుకు సంబంధించి పోలీసులు ఎలాంటి ఆధారాలను సేకరించలేకపోయారు. సురేష్‌ కాల్‌డేటా ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు.  సురేష్‌ వద్దకు తరచూ ఒక్క యువకుడు వచ్చేవాడని అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ తెలిపాడు. ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. ప్రాధమిక విచారణలో హత్యగా తేల్చిన పోలీసులు.. పోస్ట్‌మార్టం పూర్తి అయ్యాక సాయంత్రం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. భార్య, కుటుంబ సభ్యులు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు.

(చదవండి : అమీర్‌పేట్‌లో శాస్త్రవేత్త దారుణహత్య)

కేరళకు చెందిన శ్రీధరణ్‌ సురేష్‌ (56) అమీర్‌పేట్‌ ధరంకరం రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ నం ఎస్‌–2లో నివాసం ఉంటున్నాడు. బాలానగర్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ పరిశోధన సంస్థలో సురేష్‌ శాస్త్రవేత్తగా పనిచేస్తుండగా.. భార్య ఇందిర ఇండియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా.. కుమార్తె రమ్యకు వివాహం జరిగింది. 2005లో భార్య బదిలీపై తమిళనాడుకు వెళ్లడంతో సురేష్‌ ఒక్కడే నగరంలో ఉండేవాడు.

మరిన్ని వార్తలు