పోలీస్‌ అధికారి మీద పడి చితకొట్టాడు.. వైరల్‌

13 Apr, 2018 17:54 IST|Sakshi
దాడి దృశ్యాలు

లివర్‌పూల్‌(ఇంగ్లాండ్‌) : నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే  ఓ పోలీసు అధి​​కారి మీద పడి పిడి గు​ద్దులు కురిపొంచాడో వ్యక్తి. అక్కడున్న వారు అతన్ని పక్కకు లాగడంతో ఆ అధికారి పరిస్థితి చావుతప్పి కన్నులొట్ట పోయినట్లైంది. స్వల్ప గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. వివరాలోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌ నగరానికి దగ్గరలోని ఓ రోడ్డుపై పోలీసు అధికారి కేయిత్‌ కెల్లెట్‌‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాడు . అదే సమయంలో అటు వైపుగా మోటార్‌ బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తిపై అనుమానంతో ఆపి వాహనానికి సంబంధించిన పత్రాలు చూపించాల్సిందిగా కోరాడు.

దీంతో కోపోద్రిక్తుడైన వాహనదారుడు పోలీసు అధికారిని దుర్భాషలాడటమే కాకుండా మీద పడి పిడిగుద్దులు గుద్దటం మొదలుపెట్టాడు. ఆ దెబ్బలు తాళలేకపోయిన అధికారి అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఇది గమనించిన అక్కడి వారు ఆ వ్యక్తిని విడిపించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు బైకు యాజమానిని విడిపించి అటు నుంచి అటే పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని మెర్సీసైడ్‌కు చెందిన మాగ్‌హల్‌గా పోలీసులు గుర్తించారు.

బైకుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడం, డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపై చెయ్యి చేసుకోవడం వంటి నేరాల కింద అతనికి శిక్ష పడింది. ఈ దృశ్యాలన్నింటిని అటువైపుగా వెళుతున్న ఓ వాహనదారుడు తన మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు