ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ...18 మంది అరెస్ట్

13 Dec, 2017 11:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పహడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆర్‌జీ కాలనీ సమీపంలో ఒక ఫాంహౌస్‌లో బుధవారం వేకువజామున రేవ్ పార్టీ జరిగింది. బర్త్‌డే పార్టీ పేరుతో అమ్మాయిలతో నగ్న నృత్యాలు చేయిస్తుండడంతో గమనించిన గ్రామస్తులు కొందరు స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు ఫాంహౌస్ వద్దకు చేరుకుని 15 మంది యువకులు, ముగ్గురు యువతులను అరెస్ట్ చేశారు. నిందితులు పాతబస్తీకి చెందినవారని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు