పోకిరీలకు కళ్లెం వేయడానికి పోలీస్‌ శాఖ చర్యలు

7 Aug, 2018 11:24 IST|Sakshi
పొడవు గడ్డం పెంచిన యువకుడికి కటింగ్‌ చేయిస్తున్న పోలీసులు

కర్ణాటక, మాలూరు:  పట్టణంలోని పోకిరిలకు, ఆడపిల్లలను వేధించే వారికి పట్టణ పోలీసులు సోమవారం  వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. గత వారం విద్యార్థిని రక్షిత హత్య ఉదంతం అనంతరం మేల్కొన్న పోలీసులు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పట్టణంలో పోకిరిలు, ఆడపిల్లలను వేధించే వారు, వినూత్న రీతిలో హేర్‌ కటింగ్‌ చేయించుకున్న వారు, గడ్డాలు విడిచిన వారికి తగిన హెచ్చరికలు జారీ చేసే ప్రయత్నం చేపట్టారు.

ఇందులో భాగంగా ఎస్‌ఐ ఎం. ఎన్‌ మురళి నేతృత్వంలోని పోలీస్‌ సిబ్బంది సోమవారం ఉదయం పట్టణంలోని ప్రముఖ వీధులలో సంచరించి స్టైల్‌గా గడ్డం పెంచిన వారిని, చిత్ర విచిత్రంగా తల వెంట్రుకలు పెంచిన వారిని గుర్తించి వారిని నేరుగా కటింగ్‌ షాపులకు తీసుకు వెళ్లి గడ్డాలను, స్టైల్‌ కటింగ్‌లను తీయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్‌ఐ మురళి పట్టణంతో పాటు తాలూకాలోని ప్రతి గ్రామంలోను ఇలాంటి వారిని గుర్తించి గట్టిగా బుద్ధి చెబుతామన్నారు. పట్టణంలో బీట్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు