మైనర్‌ పెళ్లిని అడ్డుకున్న ‘దిశ’

11 May, 2020 03:55 IST|Sakshi

దిశ యాప్‌కు ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు

ఈనెల 13న విశాఖలో జరగనున్న పెళ్లి రద్దు

సాక్షి, అమరావతి: మహిళలు, బాలికల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌ మరో ఘనతను సాధించింది. దిశ యాప్‌కు వచ్చిన సమాచారంతో మైనర్‌ వివాహం ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే..

► విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం రామవరం గ్రామానికి చెందిన మైనర్‌ బాలికకు బలవంతపు పెళ్లి చేస్తున్నట్టు దిశ యాప్‌ ద్వారా ఆదివారం ఫిర్యాదు వచ్చింది. 
► దిశ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్‌ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. రామవరం గ్రామానికి వెళ్లిన పోలీస్‌ రెస్క్యూ బృందం మైనర్‌ బాలికకు సంబంధించిన వివరాలు సేకరించారు. 
► ఆమె చదువుతున్న సర్టిఫికెట్లను పరిశీలించిన పోలీసులు, బాలికకు ఇంకా 18 ఏళ్లు నిండలేదని ధ్రువీకరించుకున్నారు. బాలికకు ధైర్యం చెప్పి ఆమె తల్లిందండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 
► ఈనెల 13న ముహూర్తం ప్రకారం జరపతలపెట్టిన వివాహాన్ని రద్దు చేయాలని బాలిక తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. 
► బాలిక తల్లిదండ్రులకు నచ్చజెప్పి వివాహాన్ని పూర్తిగా రద్దు చేశారు.

మైనర్‌కు పెళ్లి చేస్తే చట్టరీత్యా చర్యలు
మైనర్‌ బాలికకు వివాహం చట్టరీత్యా నేరం. బాలికకు బలవంతంగా పెళ్లి చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఆపదలో ఉన్న మహిళలే కాకుండా మైనర్‌ వివాహాల వంటి వాటిపై దిశ ప్రత్యేక బృందం చర్యలు తీసుకుంటుంది. విశాఖ జిల్లాలో మైనర్‌ను స్థానిక ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ (ఐసీడీఎస్‌) కేంద్రానికి తరలించి, కౌన్సెలింగ్‌ అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించాం.
– దిశ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా