పోలీసులే అత్యాచారం.. ఆపై చేతిలో రూ.600 ఉంచి..!

15 Feb, 2020 21:36 IST|Sakshi

లక్నో: 'కంచే చేను మేసింది' అంటే ఇదేనేమో. నిర్భయ, దిశ ఇలా ఎన్ని చట్టాలు వస్తున్నా.. ఎన్‌కౌంటర్లు జరుగుతున్నా మహిళలపై దారుణాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు కూడా కొంత మంది కామాంధుల్లా తయారవుతున్నారు. తాజాగా.. ఉత్తరప్రదేశ్‌లో ఓ ఉపాధ్యాయురాలిపై పోలీసులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. వివరాల్లోకెళ్తే.. గోరఖ్‌పూర్ జిల్లాలోని గోరఖ్‌నాథ్‌‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.

ట్యూషన్ టీచర్ గా పనిచేస్తున్న 24 ఏళ్ల యువతి తన అక్క ఇంటికి వెళ్లి తిరిగొస్తోంది. వెనక ఆమె తల్లి కూడా బయల్దేరింది. దారిలో ఒంటరిగా వెళ్తున్న ఆ యువతిపై పోలీసుల కన్నుపడింది. ఇద్దరు పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ‘ఏయ్, నువ్వు వేశ్యవు కదా..’ అని అడిగారు. తాను అలాంటిదాన్ని కాదని, తన వెనకాల కొద్ది దూరంలో తల్లి కూడా వస్తోందని ఆ యువతి చెప్తున్నా వారు వినిపించుకోలేదు.

ఆమెను బలవంతంగా తమ బైకుపైకి ఎక్కించుకొని.. రైల్వేష్టేషన్ దగ్గర్లోని ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించగా తీవ్రంగా కొట్టి గాయపరిచారు. కొన్ని గంటలు గడిచాక రాత్రిపూట ఆమె చేతిలో రూ. 600 పెట్టి వెళ్లిపొమ్మన్నారు. ఆమె ఆటోలో ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వ్యాన్‌లో నలుగురు విద్యార్థుల సజీవ దహనం

మరిన్ని వార్తలు