నకిలీమందుల తయారీ గుట్టు రట్టు

13 Apr, 2018 12:58 IST|Sakshi
జి.రాగంపేట గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఔషధ నియంత్రణ అధికారులు 

‘ఒమిట్‌మెంట్‌’ ట్యాబ్‌లెట్స్‌ అక్రమ తయారీ

రూ.ఐదు లక్షల విలువైన ముడిసరకు స్వాధీనం

కాకినాడ లీగల్‌: పెద్దాపురంం మండలం జి.రాగంపేట గ్రామంలో లైసెన్స్‌ లేకుండా అక్రమంగా నకిలీ మందులు ’ఒమిట్‌మెంట్‌’ ట్యాబ్‌లెట్స్‌ తయారు చేస్తున్న కేంద్రంపై ఔషధ తనిఖీ అధికారులు, కాకినాడరూరల్, రాజమహేంద్రవరంరూరల్‌ ఔషధ నియంత్రణ అధికారులు వీఎస్‌ జ్యోతి, వి.అభిప్రియ గురువారం దాడులు నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే.. పెద్దాపురం మండలం జి.రాగంపేట గ్రామంలో ఒక ఇంటిలో అక్రమ మందులు తయారుచేస్తున్నట్టు జిల్లా ఔషధ నియంత్రణశాఖ సహాయ సంచాలకులు టి.శ్రీరామమూర్తికి అందిన సమాచారం మేరకు  ఈ దాడులు జరిగాయి. పెద్దాపురం మండలం జి.రాగంపేట గ్రామంలో ఒక ఇంటిని సోదా చేయగా సిరి క్రీమ్‌ 10జీఎం, 20జీఎం భారీగా ఉన్నట్టు గుర్తించారు.

వాటి తయారీకి సంబంధించిన ఒమిట్‌మెంట్‌ ట్యాబ్‌లు, పాకింగ్‌ సామగ్రి తదితర వాటిని కూడా గుర్తించారు. ఒమిట్‌మెంట్‌ ట్యాబ్‌లెట్‌ల తయారీకి లైసెన్స్‌ లేకుండా చేయడం నేరమన్నారు. సుమారు రూ.ఐదు లక్షల విలువగల ఒమిట్‌మెంట్‌ల మొత్తాన్ని, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఒమిట్‌మెంట్‌ తయారీకి సంబంధించిన సామగ్రిని ఔషధనియంత్రణ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులను కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. 

అల్లోపతి మందుల తయారీకి లైసెన్సు తప్పనిసరి

అల్లోపతి మందుల తయారీకి, విక్రయాలకు ఔషధచట్టం నిర్దేశించిన లైసెన్సులు తీసుకోవాలని, అవి లేకుండా చట్టవిరుద్ధమైన తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా సహాయ సంచాలకులు టి.శ్రీరామమూర్తి తెలిపారు.

మరిన్ని వార్తలు