ప్రీతి మరణానికి కారణం తల్లా ప్రియుడా..?

10 Oct, 2019 07:51 IST|Sakshi
ప్రీతి (ఫైల్‌)

చెన్నై,టీ.నగర్‌: మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరువారూరు జిల్లాలో చోటుచేసుకుంది.  నీడామంగళం వెన్నాట్రంగరై లైన్‌ ప్రాంతానికి చెందిన సుమతి మన్నార్‌గుడి మునిసిపాలిటీ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈమె భర్త నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. ఈ దంపతుల కుమార్తె ప్రితి (21) బీఈ చదివింది. ఇటీవల జరిగిన పోటీ పరీక్షలో ఉత్తీర్ణురాలైన ప్రీతికి తపాలాశాఖలో ఉద్యోగం లభించింది.

మన్నార్‌గుడి తామరైకుళం ప్రాంతంలోని తన తాత ఇంట్లో ఉంటూ 20 రోజులుగా ఎడకీళయూరు గ్రామంలోని తపాలా కార్యాలయంలో పనిచేస్తూ వచ్చారు. శనివారం తాత ఇంట్లో ఉంటున్న ప్రీతి హఠాత్తుగా ఒంటిపై కిరోసిన్‌ కుమ్మరించుకుని నిప్పంటించుకుంది. ఇరుగుపొరుగువారు వచ్చి గాయపడిన ప్రీతిని మన్నార్‌గుడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. దీనిగురించి మన్నార్‌గుడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతూ వచ్చారు. తనకు సొంతమైన పూర్వీకుల ఆస్తిని విక్రయించేందుకు తల్లి సుమతి ప్రయత్నాలు చేసింది. ఇందుకు ప్రీతి వ్యతిరేకించింది. దీంతో తల్లి, కుమార్తెల మధ్య విబేధాలు తలెత్తాయి. అలాగే, నీడామంగళం ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని ప్రీతి ప్రేమించింది. ప్రీతి ఉద్యోగం చేస్తున్నా ఇంజినీరింగ్‌ విద్య విడనాడలేదు. కొన్ని రోజుల క్రితం పరీక్ష రాసేందుకు కోవైలోని కళాశాలకు వెళ్లగా అక్కడ రెండు రోజులు హోటల్‌లో బస చేసింది. ఇది ప్రేమికుడికి నచ్చలేదు. ప్రీతిని అతను అనుమానించాడు. దీంతో ప్రేమికుల మధ్య తగాదా ఏర్పడింది. వీటిలో ఏదేని కారణంతో ప్రీతి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉన్మాది పిన్ని

కారులో యువజంట మృతదేహాలు..

అనంతపురంలో ట్రావెల్‌ బస్సు బోల్తా

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

ఆర్టీసీ సమ్మె: భార్య ఉద్యోగం పోతుందనే బెంగతో

లావుగా ఉన్నావన్నందుకు రెచ్చిపోయాడు!

93 మందితో శృంగారం, ఆ తర్వాత హత్యలు!

దసరా: తల్లిని అన్న తిట్టడంతో ఆవేశానికి లోనై..!

స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. హత్య

ఈఎస్‌ఐ కుంభకోణం: కస్టడీకి నిందితులు

మైనర్‌ కోడలిపై మామ అఘాయిత్యం

రాపిడో డ్రైవర్లపై కస్టమర్ల దాడి కలకలం

150 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌

అఖిలప్రియ భర్తపై మరో కేసు

టిఫిన్‌లో వెంట్రుక వచ్చిందని భార్యకి గుండుకొట్టాడు

శంషాబాద్‌లో భారీగా నకిలీ మద్యం పట్టివేత

మందుల కొను‘గోల్‌మాల్‌’!

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితుల మృతి

భార్యను గొడ్డలితో కడతేర్చిన భర్త

రౌడీషీటర్‌ చేతిలో ఒకరు.. భర్త చేతిలో మరొకరు

కారుతో ఢీకొట్టి కిడ్నాప్‌ చేసిన కేసులో వీడిన మిస్టరీ!

సెల్ఫీ పంజా.. నవ వధువుతో సహా..

వీధి కుక్క చావుకు  కారకుడైన డ్రైవర్‌ అరెస్టు 

అమెరికాలో నగరవాసి అనుమానాస్పద మృతి

డ్యామ్‌ వద్ద సెల్ఫీ.. నలుగురి మృతి

వెంకటేశ్వర హెల్త్‌ కేర్‌ ఎండీ అరెస్ట్‌

వీడిన కాకినాడ జంట హత్యల కేసు మిస్టరీ!

సినిమా చూస్తూ వ్యక్తి మృతి

వ్యక్తిగత కక్షతో అసభ్యకర ఫొటోలు..

హాజీపూర్‌ కేసు నేడు కోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు శింబుపై నిర్మాత ఫిర్యాదు

బోల్డ్‌ కంటెంట్‌ కథలో భాగమే

ప్రేమతో రంగ్‌ దే

చిరు152షురూ

కొత్త ప్రయాణం

నా జీవితంలో ఇదొక మార్పు