9మంది నీటిలో మునిగే చనిపోయారు..

23 May, 2020 13:16 IST|Sakshi

‍తొమ్మిది మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి

వారంతా నీటిలో మునిగే చనిపోయారు

పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడి

సాక్షి, వరంగల్‌ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో వెలుగుచూసిన తొమ్మిది మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయింది. వరంగల్‌ ఎంజీఎంలో వైద్యులు శనివారం పోస్ట్‌మార్టం చేసి, ప్రాథమిక నివేదికను విడుదల చేశారు. ఆ తొమ్మిదిమంది నీటిలో మునిగే చనిపోయినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడి అయింది. అలాగే బావిలో పడినప్పుడు ఎనిమిదిమంది శరీరాలపై గాయాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. (పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?)

మృతదేహాల నుంచి శాంపిల్స్‌ సేకరించి, నమునాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. కాగా  సాయిదత్త ట్రేడర్స్‌కు చెందిన గోనె సంచులు కుట్టే గోదాం పక్కన ఉన్న బావిలో మొత్తం 9 మంది శవాలు లభ్యమైన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వీరందరి మరణానికి దారితీసిన కారణాలు ఏంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరందరికీ మత్తు ఇచ్చారా? లేక విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. (గీసుకొండ బావిలో 9 మృత దేహాలు)

మరిన్ని వార్తలు