రీఫండ్‌ మెసేజ్‌ : రూ.1.5 లక్షలు మాయం

11 Aug, 2019 12:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : సైబర్‌ నేరాల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా మహారాష్ట్రకు  చెందిన ఓ వ్యక్తి రూ. 1.5లక్షలు నష్టపోయాడు. వివరాల్లోకి వెళితే.. ముంబై సమీపంలో నివాసం ఉంటున్న అరుప్‌ బెనర్జీ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే అరుప్‌ ఫోన్‌కు కొద్ది రోజుల క్రితం ట్యాక్స్‌ రీఫండ్‌ పేరిట ఓ మెసేజ్‌ వచ్చింది. ఆ మెసేజ్‌పై క్లిక్‌ చేయగానే.. అది వేరే అప్లికేషన్‌ లింక్‌కు వెళ్లింది. అతని అనుమతి లేకుండానే ఒక యాప్‌ అతన్ని మొబైల్‌లో డౌన్‌లోడ్‌ అయింది. దీంతో అలర్ట్‌ అయిన అరుప్‌ తనకు వచ్చిన మెసేజ్‌ను, డౌన్‌లోడ్‌ అయిన యాప్‌ను వెంటనే మొబైల్‌లో నుంచి డిలీట్‌ చేశాడు.

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ మరుసటి రోజు తన బ్యాంక్‌ అకౌంట్‌లో నుంచి రూ. 1.5 లక్షలు మాయమైనట్టు అరుప్‌ గుర్తించాడు. దీంతో వెంటనే బ్యాంక్‌కు ఫోన్‌ చేసి తన అకౌంట్‌ బ్లాక్‌ చేయించాడు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు సైబర్‌ నిపుణల సాయంతో నిందితులను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు అరుప్‌ అకౌంట్‌లో నుంచి పోయిన డబ్బు రెండు వేర్వేరు ఖాతాల్లో జమ అయినట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు