డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసు : ప్రదీప్‌ ఎక్కడ?

8 Jan, 2018 12:20 IST|Sakshi

కౌన్సిలింగ్‌కు వస్తాడా, రాడా అనే సందిగ్ధంలో పోలీసులు

రాకుంటే తీవ్రచర్యలకు సమాయత్తం.. బేగంపేట పోలీస్‌ స్టేషన్‌ వద్ద హడావిడి

హైదరాబాద్‌: డ్రంకెన్‌డ్రైవ్‌ కేసులో దొరికిపోయిన టీవీ యాంకర్‌ ప్రదీప్‌ వ్యవహారశైలి అంతుపట్టనివిధంగా తయారైంది. సోమవారం మధ్యాహ్నం బేగంపేట ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు ప్రదీప్‌ హాజరుకావాల్సి ఉంది. ఈ మేరకు ట్రాఫిక్‌ డీసీపీ చౌహాన్‌కు ప్రదీప్‌ సమాచారం కూడా అందించారు. కానీ ప్రదీప్‌ బేగంపేట స్టేషన్‌కు వస్తారా, రారా అనే సందిగ్ధంనెలకొంది.

డిసెంబర్‌ 31న అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రదీప్‌ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోవడంతో పోలీసులు కేపీహెచ్‌బీలోని ఆయన కార్యాలయంతోపాటు మణికొండలోని నివాసంలో నోటీసులు అందించేందుకు యత్నించి అందుబాటులో లేకపోవడంతో వెనక్కి వచ్చారు. దీంతో ప్రదీప్‌ పరారీలో ఉన్నట్లు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. ఇది తెలుసుకున్న ప్రదీప్‌ గత శుక్రవారం వీడియో ద్వారా తాను కౌన్సెలింగ్‌కు హాజరుకాబోతున్నట్లు తెలిపారు.

నిబంధనల ప్రకారం తల్లి లేదా భార్యను కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సి ఉంటుంది. పెళ్లి కాలేదు కాబట్టి తల్లిని తీసుకొని రావాలని నిబంధనలను పోలీసులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా కారు అద్దాలకు బ్లాక్‌ఫిలిం ఏర్పాటు చేసుకున్న ఘటనలోనూ ప్రదీప్‌పై పోలీసులు జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విద్యార్థినిని ప్రేమ పేరుతో..

కరోనా: హిట్‌ మ్యాన్‌ భారీ విరాళం!

పోలీసులు విచారణకు వెళ్తే..

కరోనా అంటూ కొట్టిచంపారు

పాపం మందుబాబు.. ఆరుసార్లు ఓటీపీ చెప్పి..

సినిమా

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సింగ‌ర్‌కు ఐదోసారీ క‌రోనా పాజిటివ్‌