ఫోన్‌కాల్‌పై అనుమానం

14 Apr, 2018 12:58 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

ప్రేమికుల మధ్య వాగ్వాదం

ప్రజ్ఞ ఆత్మహత్యకు కారణమదే!

పోలీసుల విచారణలో తేలిన నిజం

నిజామాబాద్‌ క్రైం(నిజామాబాద్‌అర్బన్‌): వచ్చేనెల పెళ్లి పీటలు ఎక్కవలసిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఒక్కో చిక్కుముడి వీడుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడితో గడిపిన ఆమెకు ఓ ఫోన్‌ రావడం, దానిపై అతడు ఆమెను అనుమానించడంతో ఇద్దరి మధ్య జరిగిన వివాదం ప్రియురాలి ప్రాణాల మీదకు వచ్చింది. నగరం లోని మహాలక్ష్మీనగర్‌కు చెందిన ప్రజ్ఞ వివాహం వచ్చేనెల 6న జరగా ల్సి ఉంది. ఇందుకు కుటుంబ సభ్యులు పనులు పూర్తి చేసుకుంటున్న తరుణంలో పెళ్లి కూతురు ప్రజ్ఞ ఆత్మహత్యపై అనేక అనుమానాలకు తావిచ్చింది. బీటెక్, ఎంబీఏ చదివిన ప్రజ్ఞకు హైదరాబాద్‌లో నవీన్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. ప్రజ్ఞతో ప్రేమలో ఉండగానే నవీన్‌కు మరొకరితో వివాహమైంది. అయినా ప్రజ్ఞ అతడిని మరవలేదు. అతడికి పెళ్లి అయినా అతనే కావాలని కో రుకుంది. కూతురు జీవితం బాగుండాలని కోరుకున్న తల్లిదండ్రులు, చెల్లెలు మొదటి శుభలేఖను వేంకటేశ్వరుడి పాదాల వద్ద పెట్టేందుకు తల్లిదండ్రులు తిరుపతికి వెళ్లారు.

అదే రోజు ఇంట్లో ఎవరూ లేక ప్రజ్ఞ తన ప్రియుడు నవీన్‌ను నిజామాబాద్‌కు రావాలని చెప్పటంతో అత ను వచ్చాడు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, గదిలో అప్పటికప్పుడు ప సుపు కొమ్ముతో తాళి సిద్ధం చేసి అతడితో మెడలో కట్టించుకుంది. అనంతరం ప్రజ్ఞకు ఓ స్నేహితురాలు ఫోన్‌ చేసింది. ఫోన్‌ లిఫ్ట్‌ చేయగానే ఆమెను పూర్తి పేరుతో కాకుండా నిక్‌ నేముతో పలకరించింది. ఫోన్‌ మాట్లాడాక నవీన్‌ ‘ఎవరూ ఫోన్‌ చేసిందని’ అని అడిగాడు. దాం తో ఆమె తన స్నేహితురాలు అని చెప్పింది. మరి మగ పేరుతో ఎందు కు పిలిచావని నవీన్‌ మరోసారి ప్రజ్ఞను అడగటంతో ఇద్దరి మధ్య స్వల్పంగా గొడవ జరిగింది. దాంతో నవీన్‌ హైదరాబాద్‌ వెళ్తాను అం టూ బయటకు వచ్చాడు. అతడి వెనుకే ఆమె కూడా వచ్చి నువ్వు తిరి గి రాకపోతే చనిపోతానంటూ చెప్పింది. అతను నీ ఇష్టం అనడంతో ఆమె కోపంతో తిరిగి ఇంటికి వచ్చి చున్నితో ఉరేసుకుంది. కాస్సేపటి కి నవీన్‌ ఆమెకు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. ఇంటికి వెళ్లి కిటికీ నుంచి చూడగా బెడ్‌పై పడి ఉండటంతో అతను వెంటనే ప్రజ్ఞ చెల్లెలు కు ఫోన్‌ చేసి విషయాన్ని తెలిపాడు. అనంతరం నవీన్‌ అక్కడి నుంచి జారుకున్నాడు. మంగళవారం ఉదయం విషయం పోలీసులకు తెలియడంతో వారు ఘటన స్థలానికి వచ్చి కేసును చేధించినట్లు సమాచా రం.  నవీన్‌ను శుక్రవారం రాత్రి పట్టుకొని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలి పారు.  కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.

సంబంధిత వార్త : పెళ్లి కాకుండానే మెడలో పసుపు తాళి

మరిన్ని వార్తలు