‘ప్రణయ్‌ ఆత్మ మాతో మాట్లాడుతోంది.. మీతో మాట్లాడిస్తాం’

16 Oct, 2018 10:08 IST|Sakshi
మిర్యాలగూడ : కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ సదానాగరాజు

మిర్యాలగూడ అర్బన్‌ : ఇటీవల మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌ ఆత్మ కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్టు వన్‌టౌన్‌ సీఐ సదానాగరాజు తెలిపారు.  సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెళ్లడించారు. హైదరాబాద్‌ పటాన్‌చెర్వుకు చెందిన నాగారావు, సత్యప్రియ, నర్సిం హ్మ అనే ముగ్గురు వ్యక్తుల ఆదివారం ముత్తిరెడ్డికుంటలో ఉన్న ప్రణయ్‌ నివాసాసికి వ చ్చారు. ప్రణయ్‌ ఆత్మ తమతో మాట్లాడుతుం దని, మీతో కూడా మాట్లాడిస్తామని నమ్మబలి కారు.  అనుమానం వచ్చిన ప్రణయ్‌ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించి వారిపై పిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలి పారు. ఆత్మ ఉందనే పేరుతో ప్రణయ్‌ కుటుంబ సభ్యులను మోసం చేయడానికి వారు వచ్చారని సీఐ పేర్కొన్నారు.

బెదిరింపు కేసులో కోర్టులో నిందితుల హాజరు
మిర్యాలగూడ టౌన్‌ : బెదిరింపుల కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం మిర్యాలగూడ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం. శోభారాణి ఎదుట హాజరుపరిచారు. వివరాలు.. ప్రణయ్‌ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటు న్న తిరునగరు మారుతీరావు, శ్రవణ్, ఖరీంలు కొంతకాలం క్రితం ప్రణయ్, అమృత వివాహ రిసెప్షన్‌ను నిలిపివేయాలని పట్టణానికి చెందిన దినేశ్, అశోక్‌ను బెదిరించారు. దీంతో బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను పీటీవారెంట్‌పై కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్న ట్టు తెలుసుకున్న మారుతీరావు అనుచరగణం పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు వచ్చారు. భారీ బందోబస్తుతో పోలీసులు నిందితులను నల్లగొండ జైలుకు తరలించారు.

మరిన్ని వార్తలు