ప్రసవమైన అరగంటకే బాలింత మృతి

7 May, 2019 08:05 IST|Sakshi
మృతి చెందిన బాలింత రశ్మి (ఫైల్‌), నర్సిం హోం ముందు ధర్నా చేస్తున్న బాధితులు

వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆగ్రహం

నర్సింగ్‌ హోం ముందు మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన

కర్ణాటక, దొడ్డబళ్లాపురం:డెలివరీ జరిగిన అరగంటకే బాలింత మృతి చెందడంతో అందుకు వై ద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ ఆ గ్రహించిన మృతురాలి కుటుంబ సభ్యు లు నర్సింగ్‌హోం ముందు ఆందోళన చేసినసంఘటన చెన్నపట్టణలో చోటుచేసుకుంది.చెన్నపట్టణ తాలూకా దేవనహొసహళ్లి గ్రామానికి చెందిన రశ్మి (19) డెలివరీ కో సం పట్టణంలోని బాలు నర్సింగ్‌హోంలో చేర్చారు. సోమవారం ఉదయం డెలివరీ కాగా అరగంటకే రశ్మి మృతి చెందింది. డెలివరీ చేసిన డాక్టర్‌ శైలజ నిర్లక్ష్యం వల్లే రశ్మి మృతి చెందింద ని ఆగ్రహించిన మృ తురాలి కుటుంబ సభ్యులు నర్సింగ్‌హోం ముందు ఆందోళన చేపట్టారు. రశ్మి మృతిచెందిన తక్షణం వైద్య సిబ్బంది శవాన్ని ఆపరేషన్‌ థియేటర్‌లోనే వదిలి పరారయ్యారని బాధితులు ఆరోపించారు. చెన్నపట్టణ పోలీసులు ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా