గర్భిణి అనుమానాస్పద మృతి

2 Dec, 2017 10:44 IST|Sakshi
జయంతి మృతదేహం

పెళ్లయిన ఆరు నెలలకే విషాదం

అల్లుడే చంపాడంటున్న గర్భిణి తల్లిదండ్రులు

పరారీలో భర్త జయరాం

బూర్జ: మండలంలోని లచ్చయ్యపేటలో నివాసముంటున్న ముంజేటి వెంకటలక్ష్మి అలియాస్‌ జయంతి(24) అనే గర్భిణి అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. తోటవాడకు చెందిన జయరామ్‌కు కొత్తూరు మండలం కల్లట గ్రామానికి చెందిన జయంతితో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. రెండు నెలల కిందట వీరిద్దరూ లచ్చయ్యపేట చేరుకొని అక్కడే నివాసముంటున్నారు. జయరామ్‌ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో మద్యాని కి బానిసయ్యాడు. మందు మానేయాలని భార్య ఒత్తిడి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో భార్యాభర్తలిద ్దరూ తరచూ గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలో నే గురువారం సాయంత్రం 6 గంటలకు భార్యాభర్తలిద్ద రూ టీ తాగి ఇంట్లోకి వెళ్లిపోయారు.

శుక్రవారం ఉదయ ం 8 గంటల వరకు తలుపులు తీయకపోవడంతో స్థా నికులకు అనుమానం వచ్చి తలుపులు తెరిచారు. జయ ంతి మెడకు చీరతో ఉరి వేసి ఉండటంతో వెంటనే పోలీ సులకు సమాచారం అందించారు. కొద్దిసేపటి తర్వాత ఎస్‌ఐ జనార్దన్‌ ప్రమాద స్థలానికి చేరుకొని పరిస్థితిని స మీక్షించారు. ఇంటి వెనుక భాగంలో ఉన్న పెరడు తలు పులు తెరిచే ఉండటం, భర్త పరారీలో ఉండటంపై ఆరా తీశారు. తహసీల్దార్‌ కిరణ్‌కుమార్, వీఆర్‌ఓ గ్రామపెద్దలు శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పో స్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆరు నెలల కిందటే వివాహం..
అల్లుడే తమ కుమార్తెను కడతేర్చాడని జయంతి తల్లిదండ్రులు మామిడి సూర్యనారాయణ, అన్నపూర్ణమ్మలు ఆరోపించారు. జయరామ్‌ నిత్యం మద్యం తాగి కుమార్తెను వేధించేవాడని కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పులు చేసి ఆరు నెలలు కిందటే వివాహం చేశామని, కట్నం కింద మూడు లక్షల రూపాయలు, మూడు తులాల బంగారం ఇచ్చామని చెప్పారు. భర్త పెట్టే నరకయాతన తట్టుకోలేకపోయినా తమ పరిస్థితి చూసి భరించేదని వాపోయారు. భూమి తనఖా పెట్టి ఆటో కొని ఇచ్చామని, కూతురు అల్లుడు బాగానే ఉన్నారని అనుకున్నామని,  ఇంతలోనే ఈ అ«ఘాయిత్యం జరిగిందని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.

మరిన్ని వార్తలు