వార్డర్‌ వేధింపులతో ఖైదీ ఆత్మహత్యాయత్నం?

8 Sep, 2019 11:12 IST|Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం క్రైం: వార్డర్‌ పెట్టే వేధింపులు తట్టుకోలేక ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌లో జీవిత ఖైదు అనుభవిస్తున్న అప్పలనాయుడు ఈ నెల 5న బాత్‌రూమ్‌ కడిగే యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. దీంతో అతడ్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జైల్‌లో పని చేసే ఒక వార్డ ర్‌ వేధింపుల వల్లే ఆ ఖైదీ యాసిడ్‌ తాగినట్టు తెలి సింది. జైల్‌లోని ఖైదీలు తమ బంధువులతో మా ట్లాడుకునేందుకు ఫోన్‌ సౌకర్యం కల్పిస్తారు. ఓవార్డర్‌ ఖైదీని నగదు అడగడంతో ఇవ్వలేకపోయిన అతడు ఫోన్‌లో మాట్లాడుకునే అవకాశం కల్పించకపోవడంతో మనస్తాపం చెంది బాత్‌రూమ్‌ను క్లీన్‌ చేసే యాసిడ్‌ తాగినట్టు సమాచారం. దీనిపై రాజమహేంద్రవరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి   సీఐ త్రినాథ్‌ దర్యాప్తు చేస్తున్నారు.

జీవిత ఖైదు పడిందనే మనస్తాపంతోనే...
ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న వన్‌టౌన్‌ సీఐ త్రినాథ్‌ను వివరణ కోరగా ఖైదీకి జీవిత శిక్ష పడిం దనే మనస్తాపంతో సబ్బు నీళ్లు తాగినట్టు తమకు వాగ్మూలం ఇచ్చాడని తెలిపారు. వార్డర్‌ వేధింపులు కారణమని తమకు ఆ ఖైదీ చెప్పలేదన్నారు.

 బెయిల్‌ రాలేదన్న మనస్తాపంతో...
దీనిపై జైల్‌ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ రాజారా వును వివరణ కోరగా ఖైదీ అప్పలనాయుడు బెయి ల్‌ రాలేదనే మనస్తాపంతో సోప్‌ వాటర్‌ తాగాడని తెలిపారు. జీవిత ఖైదీలకు సాధారణంగా బెయిల్‌ మంజూరు కాదని, ఈ నేపథ్యంలో మనస్తాపంతో అతడు సోప్‌ వాటర్‌ తాగితే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని చెప్పారు.

మరిన్ని వార్తలు