కటకటాల్లో టిక్‌టాక్‌

30 Jan, 2020 09:13 IST|Sakshi

పరప్పన జైల్లో ఇద్దరు ఖైదీల హల్‌చల్‌  

కర్ణాటక, బనశంకరి: పలు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లిన ఇద్దరు రౌడీలు పరప్పన అగ్రహార జైలులో టిక్‌టాక్‌ చేయడం జైల్లో లోపాలకు అద్దం పడుతోంది. పలు నేరాల్లో జైలులో శిక్ష అనుభవిస్తూ తన ప్రియురాలి ఫోటో పెట్టి రౌడీలు టిక్‌టాక్‌ వీడియో చేశారు. అది ఇప్పుడు సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందుతోంది. ఈ సంఘటనతో జైలులో భద్రత పట్ల అనుమానం వ్యక్తమౌతోంది. పోలీసుల కాల్పుల్లో గాయపడి జైలుకెళ్లిన రౌడీలు వసీం, ఫయాజ్‌ ఇద్దరు జైలు నుంచి తమ ప్రియురాళ్లతో టిక్‌టాక్‌ చేశారు.

టిక్‌టాక్‌లో చాకు, కడ్డీ వంటివి ప్రదర్శిస్తూ వీరిద్దరూ రౌడీయిజం ప్రదర్శించారు. ఖైదీ వసీం శ్యాండల్‌వుడ్‌ నటుడు డైలాగ్‌తో వీడియో చేశాడు. జైలులో సిగరెట్‌ తాగుతూ కూర్చున్న ఫోటోకు కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ డైలాగ్‌ తో టిక్‌టాక్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఫయాజ్‌ అనే ఖైదీ ఓ యువతితో ఫోటో పెట్టి తేరీమేరీ కహాని అంటూ టిక్‌టాక్‌ చేశాడు. జైలులోపలకు సెల్‌ఫోన్లు, సిగరెట్లు ఎలా వెళ్లాయి అనేది తేలాల్సి ఉంది.   

మరిన్ని వార్తలు