ప్రియాంక హత్య కేసు; ఉలిక్కిపడ్డ గుడిగండ్ల

29 Nov, 2019 17:06 IST|Sakshi

సాక్షి, మక్తల్‌: డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులు కారణంగా తమ గ్రామానికి చెడ్డ పేరు వచ్చిందని నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామ వాసులు అంటున్నారు. తమ గ్రామానికి చెందిన ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులు చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌ కుమార్‌ ఇంత ఘాతుకానికి పాల్పడ్డారంటే నమ్మలేకపోతున్నామని గ్రామస్తులు చెప్పారు. ఈ ముగ్గురు సొంతూరిలో బాగానే ఉండేవారిని, వారిపై ఎటువంటి ఫిర్యాదులు లేవని వెల్లడించారు. ఊళ్లో ఎక్కువగా కనబడేవారు కాదన్నారు. వీరి తల్లిదండ్రులు మంచివాళ్లేనని, కూలిపని చేసుకుని జీవిస్తున్నారని చెప్పారు. చెన్నకేశవులు ఐదు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడని తెలిపారు.

గుడిగండ్ల గ్రామంలో 60 మంది వరకు లారీల మీద పనిచేస్తున్నారు. ప్రియాంకరెడ్డి హత్య కేసులో లారీ నంబర్‌ ఆధారంగానే నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మహ్మద్‌ పాషాది గుడిగండ్ల పక్క గ్రామైన జక్లేర్‌. అతడి దగ్గర చెన్నకేశవులు, శివ, నవీన్‌ పనిచేస్తున్నారు. ఈ నలుగురు ప్రియాంక స్కూటర్‌ టైర్‌ను పథకం ప్రకారం పంక్చర్‌ చేసి తర్వాత ఆమెను ట్రాప్‌ చేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని గుడిగండ్ల, జక్లేర్‌ గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు నిందితుల కుటుంబ సభ్యులు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు.

రెండు నెలల నుంచి లారీ క్లీనర్‌ పనిచేస్తున్నాడని శివ తండ్రి తెలిపాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వచ్చి పోలీసులు తమ కుమారుడిని తీసుకెళ్లారని చెప్పాడు. ఊరిలో మంచిగానే ఉండేవాడని, ఎటువంటి చెడు పనులు చేయలేదని వివరించాడు. ఆవారా తిరుగుతుండటంతో తాను తిట్టేవాడినని, దాంతే మహ్మద్‌ పాషా వద్ద క్లీనర్‌గా చేరాడని వెల్లడించాడు. తన కొడుకు మైనర్‌ అని, అతడి వయసు 17 ఏళ్లు మాత్రమేనని తెలిపాడు.


ప్రియంకారెడ్డి హత్యకేసులో ఉన్న నిందితుల్లో ఒక్కొక్కరిది ఒక్క భిన్న మనస్తత్వం కలిగి ఉన్నారు. నిందితుల్లో ముగ్గురు 20 సంవత్సరాలు కూడా దాటని వారున్నారు. ఇందులో నవీన్ కుమార్ ఓ భిన్నమనస్తత్వం కలిగి ఉన్నాడు. తన మామూలు బైక్ ను స్పోర్ట్స్ బైక్‌లా మార్చుకున్నాడు. అంతే కాదు హెడ్ లైట్ తీసేసి దాని స్థానంలో డేంజర్ అని బొమ్మ వేసుకున్నాడు. ఇక టైగర్ బొమ్మలతో పాటు, వివిధ క్యాప్షన్లతో బైక్ తయారు చేసుకుని, రంద్రాలు పెట్టిన సైలెన్సర్ సౌండ్‌తో గ్రామంలో హల్ చల్ చేసేవాడని గ్రామస్తులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు...

ప్రియాంక హత్య.. గుండె పగిలింది

నమ్మించి చంపేశారు!

భయమవుతోంది పాప​.. ప్లీజ్‌ మాట్లాడు

ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు

ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు

అప్పుడు  అభయ.. ఇప్పుడు !

మరిన్ని వార్తలు