ప్రియాంకా రెడ్డి హత్య కేసులో పురోగతి

29 Nov, 2019 10:57 IST|Sakshi

పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

సాక్షి, హైదరాబాద్‌ : సంచలనం సృష్టించిన ప్రియాంకా రెడ్డి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. టోల్‌ ప్లాజా వద్ద ఉన్న లారీ డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు మరో ఇద్దరుని సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. నిందితులంతా మహబూబ్‌నగర్‌కు చెందినవారు. లారీ డ్రైవర్‌తో పాటు క్లీనర్‌తో పాటు మరో ఇద్దరు మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా ప్రియాంక తన చెల్లితో మాట్లాడిన సమయంలో ఆ ప్రాంతంలోని ఫోన్‌ సిగ్నల్స్‌ను పోలీసులు ట్రేస్‌ చేశారని, ఆ సమయంలో వీరిద్దరి ఫోన్‌ కాల్స్‌ గుర్తించినట్లు, వారి కాల్‌డేటా ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగానే ప్రియాంకా రెడ్డి స్కూటీ పంక్చర్‌ చేసినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. 
చదవండినమ్మించి చంపేశారు!

చదవండిఅప్పుడు  అభయ.. ఇప్పుడు !
ముందే ప్రియాంక స్కూటీకి పంక్చర్‌ చేసి అనంతరం పంక్చర్‌ వేయిస్తానంటూ మాయమాటలు చెప్పి... ఆ తర్వాత ఆమెను బలవంతంగా అక్కడ నుంచి తీసుకు వెళ్లినట్లు విచారణలో నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. నిర్మానుష్య ప్రాంతంలో ప్రియాంకా రెడ్డిపై అత్యాచారం చేసి, అనంతరం హతమార్చి.. షాద్‌ నగర్‌ సమీపంలో ఆమెను సజీవ దహనం చేశారు. అనంతరం నిందితులు తిరిగి హైదరాబాద్‌ వచ్చి అక్కడ నుంచి కొత్తూరు వైపు వెళ్లారు. లారీలో ఉన్న ప్రియాంకా రెడ్డి  స్కూటీ నెంబర్‌ ప్లేట్‌ను కొత్తూరు వద్ద పడవేశారు. వీరిలో ముగ్గురు నిందితులు 25ఏళ్ల యువకులు. నిందితులను ఇవాళ మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.ప్రియాంక కుటుంబానికి పరామర్శ
మరోవైపు మృతురాలు ప్రియాంకారెడ్డి కుటుంబాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ప్రియాంక తల్లిదండ్రులను మంత్రి ఓదార్చారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఇల్లు, ఉద్యోగం తప్ప తమ కుమార్తెకు మరొకటి తెలియదని విలపిస్తున్న ప్రియాంక తల్లి  ఆవేదనను ఎవరూ తీర్చలేనిదన్నారు. మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మహిళలు.. షీటీమ్స్‌ ఫోన్‌ నెంబర్స్‌ దగ్గర ఉంచుకోవాలని అన్నారు. ప్రియాంక పోలీసులకు కాల్‌ చేసి ఉంటే.. దారుణం జరిగేది కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. 

చదవండిఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు

మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి
ప్రియాంకారెడ్డి హత్యకేసుపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ కేసును తాను పర్సనల్‌గా మానిటర్‌ చేస్తున‍్నట్లు ట్వీటర్‌లో పేర్కొన్నారు. కేసు వివరాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నామని, ఈ దారుణానికి పాల్పడిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా పోలీసులను కోరారు. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందేలా చేస్తామని అన్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే 100 నంబర్‌కు కాల్‌ చేయాలని సూచించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా