నా కొడుకు అలాంటివాడు కాదు: పాషా తల్లి

29 Nov, 2019 14:21 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్య కేసులో లారీ నెంబరు(ts 07 ua 3335) ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న నలుగురిని తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో మక్తల్‌లో అరెస్టు చేశారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తిని లారీ యజమానిగా గుర్తించారు. గత కొంతకాలంగా శ్రీనివాస్‌రెడ్డి వద్ద లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న మహ్మద్‌ పాషాను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు. జక్లేర్ గ్రామానికి చెందిన పాషాతో పాటు చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌ కుమార్‌లను నిందితులుగా గుర్తించారు. ప్రియాంకారెడ్డి మర్డర్‌ కేసును ఛేదించిన క్రమంలో సాయంత్రం ఆరు గంటలకు సైబరాబాద్‌ పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు సమాచారం.

మహ్మద్‌ పాషా తల్లి

కాగా నిందితులంతా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినవారే. గుడిగండ్ల గ్రామానికి చెందిన జొల్లు నవీన్ కుమార్, జొల్లు శివ లు అన్నదమ్ముల బిడ్డలు. చెన్నకేశవులుది కూడా అదే గ్రామం. ఇక ఘటన గురించి మహ్మద్‌ పాషా తల్లి మోలే బీ మాట్లాడుతూ.. తన కొడుకు అలాంటివాడు కాదని పేర్కొంది. ‘ నా కొడుకు హైదరాబాద్‌లో లారీ నడిపిస్తున్నాడు. నిన్న అర్దరాత్రి తర్వాత ఎవరో వాడిని తీసుకెళ్లారు. అసలేం జరిగిందో నాకు తెలియదు’ అని పేర్కొంది. మరోవైపు... నవీన్‌, శివ ఇంట్లో కూడా దిగ్భ్రాంతి వాతావరణం నెలకొంది. వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ‘ఉదయం నుంచి వాళ్ళ గురించి ఎవరికీ ఏమీ తెలియడం లేదు. తెల్లవారక ముందే వచ్చి ఎవరో తీసుకుని వెళ్ళారు. టీవీలో ఈ వార్తలు వచ్చేంత వరకూ మాకు ఈ విషయం తెలియదు’ అని వాపోయారు. ఇదిలా ఉండగా... ప్రియాంకారెడ్డి కుటుంబ సభ్యులను మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ హైదరాబాద్లో పరామర్శించారు. 

సంబంధిత వార్తలు...

 వీడిన ప్రియాంకా రెడ్డి మర్డర్‌ మిస్టరీ.. ఆ నలుగురే

అందుకే మా పాప ప్రాణం పోయింది: ప్రియాంక తండ్రి

ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు

అప్పుడు అభయ.. ఇప్పుడు !

నమ్మించి చంపేశారు!

ప్రియాంక హత్య కేసులో కొత్త విషయాలు

భయమవుతోంది పాప.. ప్లీజ్ మాట్లాడు 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విద్యార్థినిని ప్రేమ పేరుతో..

కరోనా: హిట్‌ మ్యాన్‌ భారీ విరాళం!

పోలీసులు విచారణకు వెళ్తే..

కరోనా అంటూ కొట్టిచంపారు

పాపం మందుబాబు.. ఆరుసార్లు ఓటీపీ చెప్పి..

సినిమా

స్ఫూర్తి నింపేలా...

మిస్‌ యు

హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ 

ఆ వార్తలు నిజం కాదు

ప్రజల కోసం చేసిన పాట ఇది

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు