వేశ్యావాటిక గుట్టురట్టు

28 Jan, 2020 10:44 IST|Sakshi

ఆరుగురు అమ్మాయిలకు విముక్తి

కర్ణాటక ,బనశంకరి: అధిక వేతనంతో కూడిన ఉద్యోగం ఇస్తామని నమ్మించి బయటి రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి వేశ్యవాటిక నిర్వహిస్తున్న వ్యక్తిని సోమవారం అరెస్ట్‌ చేసి ఆరుమంది యువతులను కాపాడామని సీసీబీ జాయింట్‌ కమిషనర్‌ సందీప్‌పాటిల్‌ తెలిపారు. సోమవారం నగరంలో మీడియాతో మాట్లాడారు. ఈజీపుర వీజీఎస్‌లేఔట్‌లో వేశ్యవాటిక దందా నిర్వహిస్తున్నట్లు సీసీబీ పోలీసులకు పక్కాసమాచారం అందింది. దీని ఆధారంగా సోమవారం సీసీబీ పోలీసులు వీజీఎస్‌ లేఔట్‌ రెండో అంతస్తులో నిర్వహిస్తున్న హువాన్‌ తై స్పాపై దాడిచేసి వేశ్యవాటిక నిర్వాహకుడు సూర్యను అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి రూ.10,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. మొబైల్‌ఫోన్లలో విటులను సంప్రదించి దందా నడిపేవారు. వేశ్యవాటిక దందాలో చిక్కుకున్న ఆరుమంది ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను రక్షించామని తెలిపారు. పరారీలో  ఉన్న అబ్దూల్‌ముకీద్, గురురాజ్,  ప్రజ్వల్‌ అనే ముగ్గురి కోసం గాలిస్తున్నామని వీరిపై వివేకనగరపోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు