పైశాచికత్వం : భార్యను వివస్త్రను చేసి..

24 Feb, 2020 09:42 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి : భిక్కనూరులో ఓ భర్త పైశాచికత్వం సంచలనం సృష్టించింది. భార్యను చితకబాదిన సదరు ప్రబుద్ధుడు ఆమెను వివస్త్రను చేసి రోడ్డుపైకి గెంటేశాడు. బంధువులు, పరిచయస్తులు ఆమెకు దుస్తులు అందించారు. తీవ్ర అవమానాల నేపథ్యంలో ఆమె నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్త పైశాచికత్వంపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

మరిన్ని వార్తలు