చెడ్డీ గ్యాంగ్‌ చిక్కింది..

30 Dec, 2019 13:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొంతకాలంగా హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. చెడ్డీ గ్యాంగ్‌లోని ఏడుగురిని రాచకొండ, ఎల్‌బీ నగర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ గ్యాంగ్‌ పగటిపూట బొమ్మలు అమ్ముకుంటూ రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో దోపిడీలకు పాల్పడుతోంది. ఈ ముఠాపై హిమాచల్‌ ప్రదేశ్‌, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో మొత్తం 14 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ ఏడుగురు ముఠా సభ్యుల నుంచి 150 గ్రాముల బంగారం, రూ.3వేలు నగదు,నాలుగు వందల గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు.  ప్రస్తుతం మహారాష్ట్ర అకోలాలో నివాసం ఉంటున్న వీరిని టెక్నికల్‌ ఆధారాలతో రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగర వాసులకు, పోలీసులకు నిద్ర లేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్ చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు