ఉద్యోగాల పేరుతో రైల్వే ఉద్యోగుల మోసం

5 Sep, 2019 11:21 IST|Sakshi

సాక్షి, గాజువాక(విశాఖ) : రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను గాజువాక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసులో రైల్వే ఉద్యోగులైన మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కె.రఘునాథరావు, పి.శ్రీనివాసరావు పలువురు నిరుద్యోగులను నమ్మించారు. ఇద్దరు రైల్వే ఉద్యోగుల అండతో 2017, 2018వ సంవత్సరంలో 43 మంది నుంచి రూ.2.50కోట్లు వసూలు చేశారు.

ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేశారు. వారికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లను కూడా తయారు చేసి ఇవ్వడంతోపాటు వైద్య పరీక్షలను కూడా చేయించి ఉద్యోగాల్లో చేరాలని చెప్పారు. నిరుద్యోగులు ఆ ఆర్డర్లను తీసుకొని భువనేశ్వర్‌లోని ఈస్టుకోస్టు రైల్వే ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఆ ఆర్డర్లను పరిశీలించిన రైల్వే అధికారులు అవి నకిలీ ఉత్తర్వులని నిర్థారించారు. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న నిరుద్యోగులు గాజువాక పోలీసులను ఆశ్రయించారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అప్పటి నుంచి నిందితుల కోసం గాలిస్తున్నారు. చివరకు ఇద్దరు వ్యక్తులు పట్టుబడటంతో వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు గాజువాక సీఐ సూరినాయుడు తెలిపారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కబడ్డీ ఆటలో గొడవ.. కొట్టుకు చచ్చారు

వైజాగ్‌ యువతి అదృశ్యం

గెస్ట్‌హౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు

వైద్యుడి నిర్లక్ష్యం.. బాలికకు వైకల్యం

ఆగని ‘కల్తీ’ మద్యం దందా..!

సినిమాలో వేషం ఇప్పిస్తానని మోసం

వామ్మో.. గొలుసు దొంగలు

బర్త్‌ డే కేక్‌ తిని.. కుటుంబంలో విషాదం

గణేష్‌ వేడుకల్లో ప్రధానోపాధ్యాయుడి పాడుబుద్ధి..

విమానాశ్రయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని..

ఒక బైక్‌.. 31 చలానాలు

హర్యానాలో ఖా‘కీచకం’

మద్యానికి బానిసై మగువ కోసం..

పంటినొప్పి నెపంతో వచ్చి వైద్యురాలిపై దాడి

జనసేన కోసం కష్టపడితే మోసం చేశారు..

పరిటాల వర్గీయుల బరితెగింపు 

విడిపోయి ఉండలేక.. కలిసి చచ్చిపోదామని..

రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.. డబ్బులు ఎగ్గొట్టారు

రైస్‌ 'కిల్లింగ్‌'!

దోస్త్‌ ఫారిన్‌ పోవొద్దని...

దత్తన్న ఇంట్లో కత్తి కలకలం

శివకుమార్‌కు 13 వరకు కస్టడీ

'ఆ బాంబు బెదిరింపు నకిలీయే' 

దారుణం : స్కేలుతో చేయి విరగ్గొట్టిన టీచర్‌

యరపతినేని కేసు సీబీఐకి అప్పగింత

సినిమాను తలపించే రియల్‌ క్రైమ్‌ స్టోరీ

మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం

గర్భవతి అని చూడకుండా కడుపుపై తన్నాడు

ఎదుటే గణేష్‌ విగ్రహం.. ఏం చేశారో చూడండి..!

యూపీలో దారుణం..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మణిరత్నం దర్శకత్వంలో త్రిష?

తలైవా మరో చిత్రానికి సిద్ధం!

సినిమా బాగాలేదనేవాళ్లకు డబ్బులు వెనక్కి ఇస్తాను

ఆర్య చూసి హీరో అవ్వాలనుకున్నా

అందుకే హీరో అయ్యా!

రెండు అడుగులతో నెట్టింట్లోకి....