అమ్మాయి పేరుతో నకిలీ ఖాతా.. 10 వేల ఫాలోవర్స్‌

20 Apr, 2020 10:31 IST|Sakshi

సాక్షి, రాయ్‌పుర్‌: సోషల్‌ మీడియాలో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను కొనసాగిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. రాయ్‌పుర్‌కు చెందిన రవి అనే వ్యక్తి ‘నిషా జిందాల్‌’ అనే అమ్మాయి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ అకౌంట్‌కు ప్రస్తుతం పదివేల మందికిపైనే ఫాలోవర్స్‌ ఉన్నారు. కాగా నిషా జిందాల్‌ అకౌంట్‌పై అనుమానం వచ్చిన పోలీసలు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఇంజనీరింగ్‌ చదువుతున్న రవి ఇతర సోషల్‌ మీడియా వెబ్‌సైట్లలో కూడా నకిలీ ఖాతాలను నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (యుద్ధభూమిలో ఉన్నాం.. : రష్మిక)

ఇక గత 11 సంవత్సరాల నుంచి నిందితుడు ఇంజనీరింగ్‌ కూడా పాస్‌ అవ్వలేదని ఐఎస్‌ అధికారి ప్రియాంక శుక్లా వెల్లడించారు. కాగా నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను కొనసాగిస్తున్న నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులను ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ ప్రశంసించారు. ‘ఎటువంటి మోసమైనా పోలీసుల నుంచి తప్పించుకోదు. తప్పుదారి పట్టించాలనుకునే వారందరినీ బయటపెడతాం. రాయ్‌పూర్‌ పోలీసులు మంచి పని చేశారు’. అంటూ ట్వీట్‌ చేశారు. (సందీప్‌ ఛాలెంజ్‌ స్వీకరించిన రాజమౌళి)

మరిన్ని వార్తలు