‘రాంప్రసాద్‌ను చంపింది నేనే’

8 Jul, 2019 19:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/విజయవాడ: సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులొకొచ్చింది. రాంప్రసాద్‌ని తానే హత్య చేశానంటూ  శ్యామ్ అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చి నేరం ఒప్పుకున్నాడు. తనతోపాటు చోటూ, నరేష్‌తో కలిసి ఈ హత్య చేసినట్టు అతను ఒప్పుకున్నాడు. అయితే హత్య చేయించింది కోగంటి సత్యం అని రాంప్రసాద్ కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా... వాటిని ఖండిస్తూ తానే హత్య చేశానని శ్యామ్‌ నేరం ఒప్పుకోవడం గమనార్హం. ఈ కేసులో శ్యామ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయం గురించి శ్యామ్‌ భార్య మాట్లాడుతూ.. ‘మూడు రోజుల క్రితం నా భర్త పని ఉందని బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి వాటర్‌ ప్లాంట్‌ను నేను చూసుకుంటున్నాను. అయితే రాంప్రసాద్‌ని నా భర్త హత్య చేశాడనే విషయం నాకు తెలీదు. కానీ రాంప్రసాద్‌ మా మీద పెట్టిన కేసులు వల్ల ఆర్థికంగా నష్టపోయి.. మానసిక ఇబ్బందులు పడ్డాం. రాం ప్రసాద్‌ పెట్టిన కేసుల వల్ల పోలీసులు అర్థరాత్రి మా ఇంటికి వచ్చి సోదాలు జరిపి ఇంట్లో ఉన్న విలువైన కాగితాలు, డబ్బు, నగలు పట్టుకుపోయారు. రాంప్రసాద్‌ మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడ’ని తెలిపారు.

మరిన్ని వార్తలు