అసిఫా దోషులను శిక్షించాలి

18 Apr, 2018 11:51 IST|Sakshi
నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న మహిళా కాంగ్రెస్‌ నాయకులు

తిరుపతి అర్బన్‌ /కల్చరల్‌ : జమ్ము కాశ్మీర్‌ కథువాలో చిన్నారి అసిఫాపై అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని మహిళా కాంగ్రెస్‌ నాయకురాళ్లు మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవి, నగర అధ్యక్షురాలు బుర్రా సావిత్రియాదవ్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహం నుంచి నగర వీధుల్లో ర్యాలీగా నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద ముగించారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నా, నిర్భయ చట్టం అమలులో ఉన్నా ఫలితం లేకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకురాలు ప్రమీలమ్మ, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ స్వరాజ్య లక్ష్మి, వివిధ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. 

క్రైస్తవుల ఆధ్వర్యంలో 

దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం వచ్చాక మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలు, అరాచకాలను అరికట్టాలని అసీఫా దోషులను శిక్షించాలని, పాస్టర్‌ అరుళ్‌ అరసు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  చిన్నారి అసీఫా హత్యను ఖండిస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ తిరుపతి క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి తిరుపతి నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో పాస్టర్స్‌ రాజేంద్రన్, భీమిరెడ్డి, విజయకుమార్, డానియేల్, జాన్‌పాల్, దీలీప్, జయపాల్, ప్రమీల, జమిలా, క్రైస్తవులు, చిన్నారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు