రాపూరులో  టెన్షన్‌..టెన్షన్‌

4 Aug, 2018 11:46 IST|Sakshi
రాపూరులో పోలీస్‌పికెట్‌

రాపూరు(ప్రకాశం): రాపూరు పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగి మూడురోజులు అవుతున్నా పోలీస్‌ పికెట్‌ శుక్రవారం కూడా కొనసాగింది. దాడి చేసిన వారిని ఇప్పటికే కొంత మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు  మరికొంత మందిని అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. దాడికి సంబంధించిన వారందరనీ అరెస్ట్‌ చేసే వరకు పోలీస్‌ పికెట్‌ కొనసాగుతుందని తెలుస్తోంది. దళిత వాడలో ఇప్పటికి 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. దళితవాడలో సాయుధ బలగాలతోపాటు మహిళా కానిస్టేబుల్స్‌ కూడా ఉన్నారు. అలాగే రాపూరు ముఖ్యకూడళ్లలో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇంత మంది పోలీసులను చూడని స్థానిక ప్రజలు ఇప్పడు పట్టణంలో తిరుగుతుండటం చూస్తుండటంతో భయాం దోళనకు గురవుతున్నారు. గూడూరు డీఎస్పీ రాంబా బు రాపూరులోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు.

దాడికి సంబంధం లేని వారిని విడిచిపెట్టాలి
పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన సంఘటనలో దాడికి సంబంధంలేని వారిని వెంటనే విడిచిపె ట్టాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ, గూడూరు, వెంకటగిరి నియోజవర్గ కార్యదర్శులు కుమార్, చెంగయ్య కోరారు. ఈ మేరకు రాపూరు పో లీసులకు శుక్రవారం వినతి పత్రం సమర్పిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ దాడికి సంబంధంలేని వెంటనే విడుదల చేసి దాడికి పాల్పడినవారిని శిక్షించాలని కోరారు.

మరిన్ని వార్తలు