జ్యోతి హత్యకేసు: శ్మశానం వద్ద ఉద్రిక్తత

14 Feb, 2019 12:13 IST|Sakshi

సాక్షి, గుంటూరు : సంచలనం సృష్టించిన ‘రాజధానిలో జ్యోతి హత్య’ కేసులో జ్యోతి మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం పూర్తయింది. దీంతో మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు...పోస్ట్ మార్టంలో ఏం తేలిందో చెప్పాలంటూ డిమాండ్‌ చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. రీ పోస్ట్‌మార్టం చేసిన వైద్యుడిని జ్యోతి బంధువులు అడ్డుకున‍్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జ్యోతి బంధువులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. 

కాగా అంతకు ముందు జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం చెయ్యకుండానే పోలీసులు చేశామని చెబుతున్నారంటూ కుటుంబసభ్యులు గురువారం తాడేపల్లి మహానాడు శ్మశాన వాటిక వద్ద ఆందోళన చేపట్టారు. జ్యోతి మృతదేహంపైన పోస్టుమార్టం చేసిన ఆనవాళ్లు కనిపించటం లేదంటూ వారు అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో రీ పోస్టుమార్టం జరగాలంటూ జ్యోతి కుటుంబసభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, జ్యోతి కుటుంబసభ్యులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సీఐ బాలాజీని కాపాడటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ వారు ఆందోళన చేపట్టారు.

ఇదిలా ఉండగా తన చెల్లెల్ని అత్యాచారం చేసి హత్య చేశారని, ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేసినా పోలీసులు స్పందించడం లేదని జ్యోతి సోదరుడు ప్రభాకర్‌ వాపోయాడు. కేసును పక్కదారి పట్టించడానికి పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపించారు. పోస్టుమార్టం సైతం తూతూ మంత్రంగా చేశారన్నారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంగళగిరి సీఐ బాలాజీని సస్పెండ్‌కు సిఫార్సు చేయడంతోపాటు, ఎస్‌ఐ బాబూరావు, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌.విజయారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. (‘జ్యోతి వాచ్‌, బట‍్టలు కావాలన్నారు’)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శరద్‌పవార్‌పై మనీల్యాండరింగ్‌ కేసు 

అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్ట్‌

భవనంపై నుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

షర్టు పట్టుకుని ఈడ్చి.. పొలాల వెంట పరిగెత్తిస్తూ..

ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై ఆఘాయిత్యం

రసూల్‌పురాలో దారుణం

హడలెత్తిస్తున్న మైనర్లు

ఫోన్‌ చేసి ఓటీపీ తీసుకుని...

రూ. 500 కోసమే హత్య

నిజం రాబట్టేందుకు పూజలు

సీబీఐ పేరుతో జ్యోతిష్యుడికి టోకరా

హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు

అత్తింటి ఆరళ్లకు యువతి బలి

అమ్మ ఎక్కడుంది నాన్నా?! 

ఆడపిల్ల పుట్టిందని కుమార్తెను చంపేశారు..

శీలానికి వెల కట్టారు..

అక్రమార్జనలో ‘సీనియర్‌’ 

కృష్ణానదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం 

ఆగని తుపాకుల మోత! 

కనిపించని కనుపాపలు!

కుందూలో మూడో మృతదేహం లభ్యం 

రక్షించేందుకు వెళ్లి..

ప్రియురాలితో కలిసుండగా పట్టుకుని..

రైల్వే ప్రయాణికుడి వేషంలో చోరీలు

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

ఉద్యోగం పేరుతో ఘరానా మోసం

బాలిక అపహరణ.. సామూహిక లైంగిక దాడి

రైల్వే టికెట్‌ కౌంటర్‌లో చోరీ

బాలిక అపహరణ..సామూహిక లైంగిక దాడి

దూకుతా.. దూకుతా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడవుల్లో వంద రోజులు!

ఆర్‌ఎక్స్‌ 100 నేను చేయాల్సింది

బ్రేకప్‌!

మంచి సినిమాని ప్రోత్సహించాలి

దాదా.. షెహెన్‌షా

కొత్త కథాంశం