సహనానికి, ఓర్పుకు హద్దుంటుంది: మాజీ కెప్టెన్‌

21 Feb, 2020 11:57 IST|Sakshi
గాయాలతో సురాజ్‌ లతా దేవీ(ఫైల్‌)

ఇంపాల్‌ : ఇండియన్‌ ఉమెన్ హాకీ టీం మాజీ కెప్టెన్‌ సురాజ్‌ లతా దేవీ తన భర్త శాంతా సింగ్‌పై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం భర్త తనను తీవ్రంగా వేధిస్తున్నాడని, మానసికంగా, శారీరకంగా హింసకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం ఇంపాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘  పెళ్లైన నాటినుంచి అదనపు కట్నం కోసం నా భర్త నన్ను వేధిస్తున్నాడు. అనైతిక ప్రవర్తన కారణంగానే నాకు అర్జున అవార్డు వచ్చిందంటున్నాడు. నేనీ విషయాన్ని పబ్లిక్‌ చేయాలనుకోలేదు. అతడిలో మార్పువస్తుందనే ఇన్నిరోజులు ఎదురుచూశాను. ఏదేమైనప్పటి సహనానికి, ఓర్పుకు ఓ హద్దంటూ ఉంటుంద’ని పేర్కొన్నారు.  

కాగా, 2005లో శాంతా సింగ్‌ అనే రైల్వే ఉద్యోగిని పెళ్లాడిన ఆమె హాకీ ఆటకు దూరమయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గతంలో కూడా ఆమె పలుమార్లు భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2002లో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో సురాజ్‌ లతా దేవీ సారధ్యంలోని ఇండియన్‌ ఉమెన్‌ హాకీ టీం మూడు బంగారు పతకాలు సాధించింది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఉమెన్‌ హాకీ టీం కనబరిచిన ప్రతిభ స్ఫూర్తిగా బాలీవుడ్‌లో ‘ చక్‌ దే ఇండియా’ అనే సినిమా తెరకెక్కింది.

మరిన్ని వార్తలు