రహస్య కెమెరాలు.. 180 శృంగార వీడియోలు!

31 Jan, 2020 18:14 IST|Sakshi

కోల్‌కత్తా : యువతులను నమ్మించి మోసం చేసి ఆపై బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఇద్దరు వ్యాపారవేత్తలను కోల్‌కత్తా పోలీసులు అరెస్టు చేశారు. బెంగాల్‌కు చెందిన ఆదిత్య అగర్వాల్, అనీష్ లోహారుకా ఇద్దరూ మంచి వ్యాపారవేత్తలు.. స్నేహితులు కూడా. అయితే వీరిద్దరి​కి ఓ దుర్బుద్ధి ఉంది.  యువతులతో స్నేహం చేసి, వారిని తమ వెంట రహస్య ప్రదేశాలకు తీసుకెళ్లేవారు. చనువుగా ఉంటూ.. వారితో అన్యోన్యంగా ప్రవర్తించేవారు. కొందరిని ప్రేమ పేరుతో వంచించి శృంగారం జరపేవారు. అలా తీసుకెళ్లిన చోట ముందుగానే రహస్య కెమెరాలు అమర్చి.. ఈ తతంగం మొత్తాన్ని వీడియోలు తీసేవారు.
 
ఇలాంటి చెడు కార్యక్రమాలను 2013 నుంచి చేయసాగారు. అయితే 2018 నుంచి ఇలా వీడియోల్లోని యువతులు,  మహిళలను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టారు. పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని లేకపోతే.. తమతో జరిపిన శృంగార వీడియోలను లీక్‌ చేస్తామని బెదిరించ సాగారు. ఈ నేపథ్యంలో బ్లాక్‌మెయిలింగ్‌కు గురైన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనీష్, ఆదిత్యను అరెస్టు చేసిన పోలీసులు గురువారం వీరిని కోర్టులో హాజరుపరిచారు. అరెస్టు సమయంలో నిందితుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో సుమారు 180  శృంగార వీడియోలు లభించినట్లు పోలీసులు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు