పడవ మునక.. 40 మంది గల్లంతు

16 Oct, 2017 18:34 IST|Sakshi

పోర్ట్‌ ఔ ప్రిన్స్‌(హైతీ): వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిపోయిన ఘటనలో 40 మంది గల్లంతయ్యారు. హైతీ ఉత్తర తీరంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏడుగురిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 50 మందితో లాటోర్ట్యూ దీవి నుంచి బ్రిటన్‌ ఆధీనంలోని ప్రొవిడెన్సియల్స్‌ దీవివైపు బయలుదేరిన పడవ ఆదివారం మునిగిపోయింది.

సమాచారం అందుకున్న తీరరక్షక దళం సిబ్బంది ఏడుగురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. మిగతా వారి జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా హైతీ నుంచి సమీపంలోని బ్రెజిల్‌, చిలీ, బహమాస్‌ దేశాలకు వలస వెళ్తున్నారు. పేదరికం కారణంగా హైతీలో ప్రజలు వలసబాట పడుతున్నారు.

మరిన్ని వార్తలు