యువతిపై సామూహిక అత్యాచారం

19 May, 2018 09:21 IST|Sakshi

కర్ణాటక, ముళబాగిలు:   మేనమామ కుమారులే తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి  స్వయంగా రూరల్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై తాలూకాలోని మల్లనాయకనహళ్లి గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని బసవరాజపుర గ్రామానికి చెందిన  ఆర్‌ హరీష్‌(28), ఆర్‌ మెహన్‌(24)లను  అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. వివరాలు..గత మార్చి నెల 3న తాలూకాలోని బసవరాజపుర గ్రామానికి చెందిన  యువతి తన సంబంధీకుల ఇల్లు కన్నెత్త గ్రామానికి వచ్చింది.

ఆ సమయంలో  తన మామ కుమారులైన హరీష్, మోహన్‌లతో పాటు వారి స్నేహితులు ముగ్గురు ఇంట్లోకి ప్రవేశించి తనపై సామూహిక అత్యాచారం చేశారని  బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.  దీంతో ఎస్పీ  రోహిణి కటౌచ్‌ ఆదేశాల మేరకు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు  చేశారు. బాధితురాలిని  కోలారులోని ఎస్‌ఎన్‌ఆర్‌ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. దాదాపు రెండు నెలల క్రితం జరిగిన ఘటన అనంతరం బాధితురాలు మానసిక దిగ్భ్రాంతికి గురై రైలులో ఉత్తరభారత దేశానికి వెళ్లి అనంతరం తిరిగి వచ్చి ఫిర్యాదు చేసింది.

ఆరోపణలు తిరస్కరిస్తున్న గ్రామస్తులు :
అయితే బాధితురాలు చేస్తున్న ఆరోపణలను గ్రామస్తులు తిరస్కరిస్తున్నారు. గ్రామంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకోలేదని మేనమామల నుంచి సదరు యువతి  పలుమార్లు డబ్బులు తీసుకు వెళ్లేదని, మరోమారు డబ్బులు ఇవ్వనందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని గ్రామస్తులు అంటున్నారు.

మరిన్ని వార్తలు