రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ దారుణ హత్య

21 Sep, 2019 10:02 IST|Sakshi

సాక్షి, తాడిపత్రి: పట్టణంలోని కాలువగడ్డ వీధిలో రిటైర్డ్‌ ఫైర్‌ కానిస్టేబుల్‌ లక్ష్మన్న (68) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల మేరకు యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన లక్ష్మన్న పుట్టపర్తిలో అగ్నిమాపకశాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఎనిమిదేళ్ల కింద పదవీ విరమణ పొందాడు. లక్ష్మన్నకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.  భార్య, పెద్దకుమారుడు హరి అనంతపురంలో నివాసముంటుండగా, రెండవ కుమారుడు హరిక్రిష్ణ వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో నివాసముంటున్నాడు.

గతంలో లక్ష్మన్న తాడిపత్రి పట్టణంలోని టైలర్స్‌కాలనీలోని తన సొంత నివాసంలో ఉండేవాడు. ప్రస్తుతం కాలువగడ్డ వీధిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. అయితే శుక్రవారం రాత్రి లక్ష్మన్న రక్తపుమడుగులో పడి ఉన్న విషయాన్ని గమనించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ తేజమూర్తి, ఎస్‌ఐ ఖాజాహుసేన్‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని లక్ష్మన్న మృతి చెందినట్లు నిర్దారించారు. మృతుడు లక్ష్మన్న, కుమారులకు ఆస్తి విషయంలో తగాదాలు ఉండేవని తరచూ లక్ష్మన్న కుమారులు తన తండ్రి వద్దకు వచ్చి గొడవ పడతూ వెలుతుండేవారని స్థానికులు పోలీసులకు వివరించనట్లు సమాచారం. దీంతో లక్ష్మన్న రెండవ కుమారుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

చదవండి : కోరిక తీరిస్తేనే.. లేదంటే జీవితాంతం..  

మరిన్ని వార్తలు