రోడ్డు ప్రమాదంలో హెడ్‌ నర్స్‌ మృతి

22 Apr, 2020 13:39 IST|Sakshi
హెడ్‌ నర్స్‌ భానుమతి (ఫైల్‌)

శ్రీకాకుళం, నరసన్నపేట: జాతీయ రహదారిపై మండలం కంబకాయ కూడలి వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్ర మాదంలో శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రిలో హెడ్‌నర్స్‌గా పనిచేస్తున్న భా నుమతి బరోడా (47) మృతి చెందారు. ఆస్పత్రిలో విధులు పూర్తయిన అనంతరం భర్త మోహన్‌కుమార్‌ దాస్‌తో కలిసి ఆమె స్వగ్రామం సారవకోటకు బయల్దేరారు. సత్యవరం కూడలి వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న డీసీఎం వాహనం బలంగా ఢీకొనడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.

భర్త మోహనకు మార్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జాతీ య రహదారి అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా.. చికిత్స ప్రారంభించేలోగానే ఆమె కన్ను మూశారు. భానుమతి పదేళ్లు నరసన్నపేట, పాతపట్నం ఆస్పత్రుల్లో సేవలు అందించారు. గత నవంబర్‌లోనే హెడ్‌ నర్సుగా పదోన్నతి పొంది పాతపట్నం నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు వచ్చా రు. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదంపై నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు. హెడ్‌నర్సు మృతితో స్వగ్రామం సారవకోటతో పాటు రిమ్స్‌లోనూ విషాద ఛాయ లు అలముకున్నాయి.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు