కారు ఢీకొని ఆటో డ్రైవర్‌ మృతి.. విద్యార్థులకు గాయాలు

18 Oct, 2019 08:50 IST|Sakshi
ప్రమాద స్థలంలో బోల్తా పడిన ఆటో, ప్రమాదంలో దెబ్బ తిన్న కారు

సాక్షి, రొంపిచెర్ల(చిత్తూరు) : మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు నిలిపి ఉన్న ఆటోను ఢీకొనడంతో ఆటోడ్రైవర్‌ దుర్మరణం చెందాడు. ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఈ ఘటన మండలంలోని పెద్దగొట్టిగల్లు సమీపాన చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగేశ్వరరావు కథనం.. రొంపిచెర్ల క్రాస్‌ రోడ్డులో ఉన్న ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు నిత్యం పెద్దగొట్టిగల్లు నుంచి ఆటోలో స్కూలుకు వచ్చి వెళ్తూంటారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం స్కూలు నుంచి ఆటోలో పెద్దగొట్టిగల్లుకు వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. దండపాణి మామిడి తోట సమీపంలో రోడ్డు పక్కనే ఆటోను నిలిపి విద్యార్థులకు దించుతుండగా తమిళనాడు రాష్ట్రం తిరుత్తణికి చెందిన కారు  తిరుపతి నుంచి పీలేరు వైపు వెళుతూ మితిమీరిన వేగంతో ఆటోను ఢీకొంది.

ఈ దుర్ఘటనలో చరణ్‌(4), మోహన్‌(5), ముని శశికుమార్‌(5), తరుణ్‌రెడ్డి(5), సాయి చరణ్‌ (5), భవ్యశ్రీ (5)కు గాయాలయ్యాయి. అలాగే   ముత్యాలమ్మ గుడివీధికి చెందిన ఆటో డ్రైవర్‌ మస్తాన్‌(48) తీవ్రంగా గాయపడ్డాడు. వీరందరినీ 108లో పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి మేరుగైన చికిత్స కోసం ముగ్గురు సాయి చరణ్, భవ్యశ్రీ, తరుణ్‌రెడ్డిని  తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆటోడ్రైవర్‌ కన్నుమూశాడు. కాగా, ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్‌ గోపి భాస్కర్‌ను సంఘటన స్థలంలో పిల్లల తల్లిదండ్రులు చితకబాదారు. వారిని శాంతింపజేసి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్య చేతిలో

వాట్సాప్‌లో సర్పంచ్‌ పేరు పెట్టలేదని..

దారుణం: 8 ఏళ్ల బాలికపై బంధువు అత్యాచారం

ప్రాణం తీసిన 'తబ్లిగి జమాత్‌' వివాదం

హత్య వెనుక ప్రేమ వ్యవహారం

సినిమా

కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

బిగ్‌బాస్‌: ‘అవును ప్రేమించుకుంటున్నాం’

యాంకర్‌ సుమ ఆడపడుచు మృతి

బ‌డా నిర్మాత కూతురికి క‌రోనా

కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టా: కార్తీక్‌ ఆర్యన్‌