‘కూలి’న జీవితాలు..!

8 Jul, 2019 11:30 IST|Sakshi
ప్రమాద స్థలంలో ఉన్న ద్విచక్రవాహనం రోడ్డు ప్రమాదానికి, కారణమైన టాటా సుమో

అన్నదమ్ములు దుర్మరణం

మేనల్లుడికి హాస్టల్‌ సీటు మాట్లాడటానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం 

పెద్ద దిక్కుగా ఉన్న కొడుకును పోగొట్టుకున్న తల్లి

ప్రొద్దుటూరులో విషాదం

సాక్షి, ప్రొద్దుటూరు క్రైం : వారందరూ రోజు వారి కూలి పని చేసుకొని జీవించేవారే. అయితే వారి పట్ల విధి చిన్న చూపు చూసింది. తొండూరు మండలంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రొద్దుటూరులోని ఆంధ్ర కేసరి రోడ్డులో ఉన్న శ్రీకృష్ణదేవరాయ వీధికి చెందిన తీట్ల పవన్‌కుమార్‌ (21), తీట్ల రాజా (30), ఏసురత్నం (21) దుర్మరణం చెందారు. వీరిలో పవన్‌కుమార్, రాజా అన్నదమ్ములు, ముగ్గురు ఒకే వీధిలో పక్క పక్క ఇళ్లలో నివాసం ఉంటున్నారు. 

మేనల్లుడికి హాస్టల్‌ సీటు మాట్లాడటానికి వెళ్లొస్తుండగా..
రమణమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఆమె భర్త నరసింహుడు కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. పెద్ద కుమారుడు రాజా కూలి పనికి వెళ్తుంటాడు. అతనికి ఐదేళ్ల క్రితం శబ్బు అనే యువతితో వివాహం అయింది. వారికి మూడేళ్ల కుమారుడు ఉండగా, భార్య ప్రస్తుతం గర్భిణి. రెండో కుమారుడు పవన్‌కుమార్‌ బీరువాలు తయారు చేసే పనికి వెళ్తుంటాడు. ఆమె ఇద్దరు కుమార్తెలు సుజాత, ఆదిలక్ష్మికి పెళ్లిళ్లు అయ్యాయి. మండలంలోని చౌడూరు గ్రామంలో ఉంటు న్న సుజాత కుమారుడు ఐదవ తరగతి చదువుతున్నాడు.

అతనికి పులివెందులలోని హాస్టల్‌లో వదలడానికి మాట్లాడాలని శనివారం సాయంత్రం సుజాత సోదరులకు ఫోన్‌ చేసిం ది. దీంతో ఆదివారం మధ్యాహ్నం అన్నదమ్ములతో పాటు పక్కనే ఉన్న ఏసురత్నంను తీసుకొని ముగ్గురు బైక్‌లో వెళ్లారు. సుజాత, ఆమె కుమారుడు బస్సులో పులివెందులకు వెళ్లారు. అక్కడ పని వాయిదా పడటంతో సు జాతను, ఆమె కుమారుడిని ప్రొద్దుటూరుకు బస్సు ఎక్కించి వీరు బైకుపై ప్రొద్దుటూరుకు వస్తున్న సమయంలో తొండూరు మండలం, సైదాపురం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.


రోదిస్తున్న రాజా భార్య శబ్బు 

శ్రీకృష్ణదేవరాయ వీధిలో విషాదం
ఆంధ్రకేసరి రోడ్డులోని శ్రీకృష్ణదేవరాయ వీధి లో విషాదం నెలకొంది. ఒకే వీధిలోని ముగ్గు రు యువకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, వీధిలోని ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. భర్త మృతి చెందాడనే విషయం తెలియడంతో శబ్బు బోరున విలపించసాగింది. ఇంటి వద్ద అందరూ గుమి కూడటంతో నా బిడ్డలకు ఏమైంది అంటూ తల్లి రమణమ్మ గుండె పగిలేలా విలపిస్తోంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారని బంధువులు చెప్పినా ఆమె నమ్మలేదు. నా పిల్లలకు ఏదో అయింది.. మీరు దాచిపెడుతున్నారంటూ ఆమె విలపిస్తోంది. నా పిల్లలకు ఏమైంది దేవుడా అంటూ ఆమె ఏడుస్తోంది. అందరూ కూలి పని చేసుకొని జీవించే వారే. వారిలో ఇద్దరు యువకులు ఒకే ఇంట్లోని వారు కావడం అందరినీ కలచి వేసింది.   

పెద్ద దిక్కును కోల్పోయిన తల్లి
ఏసురత్నం కాంక్రీట్‌ పని చేస్తుంటాడు. అతని తండ్రి దేవదాసు కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో తల్లి జయమ్మ, చెల్లెలు శృతిల పోషణ బాధ్యతను అతనే చూస్తుంటాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు దూరమయ్యాడని తెలియగానే తల్లి జయమ్మ, చెల్లెలు సొమ్మసిల్లి పడిపోయారు. మేం ఇద్దరం ఎలా జీవించాలిరా.. మమ్మల్ని ఒంటరి వాళ్లను చేసి వెళ్లిపోయావా ఏసూ అంటూ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

తొండూరు : పులివెందుల – ముద్దనూరు ప్రధాన రహదారిలోని ఇనగలూరు – సై దాపురం గ్రామాల మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యు వకుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి న  ప్రతి ఒక్కరి హృదయం చలించిపోయింది.  యువకులు ప్రయాణిస్తున్న పల్సర్‌ బై కును టాటా సుమో వా హనం ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహా లను చూసి రహదారి వెంబడి వెళుతున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అం దించారు. తొండూరు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ సంఘటన స్థలా నికి వచ్చి జరిగిన ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నా రు.  మృతుల బంధువులు వచ్చి వివరాలు తెలిపేంత వరకు వా రు ఎవరనే విషయం తెలియలేదు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  

మరిన్ని వార్తలు