బాలుడ్ని తప్పించబోయారు కానీ అంతలోనే..

13 Aug, 2019 09:07 IST|Sakshi

సాక్షి, మానకొండూర్ : కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో సోమవారం కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌ వైపు నుంచి వస్తున్న కారు గుండ్లపల్లి మూలమలుపు వద్ద సైకిల్‌పై వెళ్తున్న ఓ బాలుడ్ని తప్పించబోయి అదుపుతప్పింది. బాలుడ్ని.. రోడ్డు పక్కనే ఉన్న ఓ రాజకీయపార్టీ జెండాగద్దెను ఢీకొట్టి సమీపంలోని కిరాణాషాపులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో బాలుడి కాలు విరిగింది. కారులో ఏడుగురు ఉండగా.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు.. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదా వరిఖనికి చెందిన నర్సింగ్‌భూషణ్‌ అతడి తండ్రి వెంకటాచారి, తల్లి సరోజ, భార్య స్వరూప, కుమారుడు సంచీద్రచారీ, మామ ఉప్పుల రామబ్రహ్మం, అత్త విజయలతో హైదరాబాద్‌లోని ఓ శుభకార్యానికి కారులో వెళ్లారు.

సోమవారం వేకువజామున తిరుగుపయనమయ్యారు. ఉదయం ఏడుగంటలకు గుండ్లపల్లికి చేరుకున్నారు. రాజీవ్‌ రహదారి పక్కన స్టేజీ మూలమలుపు వద్ద సైకిల్‌పై కారీలు విక్రయించే సుబ్‌ఖాన్‌ను తప్పించబోయి కారు అదుపుతప్పి బాలుడితో పాటు ఓ రాజకీయపార్టీ జెండా గద్దెను ఢీకొట్టింది. కారువేగంగా ఉండటంతో పక్కనే ఉన్న కిరాణషాపులోకి దూసుకెళ్లింది. బాలుడు సుబ్‌ఖాన్‌ కాలు విరిగింది. కారులోని నర్సింగ్‌భూషణ్‌తో పాటు భార్య స్వరూప, ఆత్త విజయలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతావారికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు, టోల్‌ప్లాజా సిబ్బంది, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని క్రేన్‌ సహాయంతో ప్రమాదానికి గురైన కారును కిందకు దించారు. క్షత్రగాతులను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కిరాణాషాపు పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో షాపు తెరవకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. షాపు నిర్వాహకుడు పబ్బతి ఆంజనేయులు ఫిర్యాదుతో ఎస్సై వంశీకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జాతీయ ‘రక్త’దారి..

స్నేహితుడి ముసుగులో ఘాతుకం

పోలీసు స్టేషన్‌పై జనసేన ఎమ్మెల్యే దాడి

జీవితంపై విరక్తి చెందాం 

అక్రమ రవాణా.. ఆపై ధ్వంసం

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం 

విధి చిదిమేసింది! 

జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు..!

పొన్నాల సోదరి మనవడి దుర్మరణం

గోవుల మృతిపై విచారణకు సిట్‌ ఏర్పాటు

అక్కా తమ్ముళ్ల మధ్య ఎన్‌కౌంటర్‌..!

శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం

ఫ్రస్టేషన్‌: ప్రియురాలు ఫోన్‌ తీయటంలేదని..

భర్తపై గృహహింస కేసు పెట్టిన టీవీ నటి

దివ్యాంగుడైన భర్త కళ్లెదుటే భార్యను..

అంగన్‌వాడీలో చిన్నారిపై అత్యాచారం..

భర్తపై భార్య హత్యాయత్నం 

కోరిక తీర్చలేదని వదినపై మరిది ఘాతుకం..

మరో సమిధ

ఆదివాసీ మహిళను వంచించిన హోంగార్డు

రోడ్డు ప్రమాదంలో భార్యభర్తల దుర్మరణం

పౌచ్‌ మార్చి పరారవుతారు

బెజవాడలో ఘోరం

మృత్యువులోనూ వీడని బంధం

వివాహేతర బంధం: భార్య, కూతురిపై కత్తితో..

మైనర్‌ బాలిక ఆత్మహత్య

సహాయం కోసం పోలీస్‌ స్టేషన్‌కెళ్తే.. కాటేశాడు

దారుణం: భార్య తలను శరీరం నుంచి వేరు చేసి..

ప్రేమ పేరుతో హోంగార్డు మోసం

అయ్యారే.. తమ్ముళ్ల నీతి..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌బాస్‌’సీరియస్‌.. శివజ్యోతి, రోహిణిలకు షాక్‌

క్రేజీ కాంబినేషన్‌

ఎవరి సలహాలూ వినొద్దన్నారు

సినిమా గురించి ప్రేక్షకులే మాట్లాడతారు

నేనొచ్చేశా!

ఎంత ఖర్చుపెట్టినా ఆ పేరు రాదు