నిద్రమత్తు తెచ్చిన అనర్థం

14 Nov, 2019 08:28 IST|Sakshi

ప్రైవేటు బస్సును క్వాలిస్‌ ఢీ

ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెళ్తూ కానరాని లోకాలకు

ఇద్దరి పరిస్థితి విషమం..

శ్రీవారి దర్శనార్థం తమిళనాడు నుంచి తిరుమలకు కుటుంబ సభ్యులతో వచ్చారు. స్వామివారిని దర్శించుకుని ఆ తర్వాత చుట్టు పక్కల దేవాలయాలనూ సందర్శించి మొక్కులు చెల్లించారు. తిరుగు ప్రయాణంలో విధి నిద్రమత్తు రూపంలో వారిని ప్రమాదానికి గురి చేసింది. ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును తమిళనాడు వాసుల క్వాలిస్‌ ఢీకొనడంతో కుటుంబ యజమాని దుర్మరణం చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

సాక్షి, పూతలపట్టు(చిత్తూరు) : తమిళనాడులోని వాలాజా తాలూకా, మాంధాగల్‌కు చెందిన హరికృష్ణ  తన కుటుంబ సభ్యులతో క్వాలిస్‌లో సోమవారం తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ముఖ్యమైన ఆలయాలను సందర్శించి బుధవారం తిరుగు పయనమయ్యారు. పూతలపట్టు మండలంలోని బాలాజీ కల్యాణ మండపం వద్ద వారి వాహనం ప్రమాదానికి గురైంది. తమిళనాడు దిండిగల్‌ నుంచి తిరుమలకు వెళ్తున్న ప్రైవేటు బస్సును అదుపు తప్పి ఢీకొంది. ఈ దుర్ఘటనలో క్వాలిస్‌ను నడుపుతున్న హరికృష్ణ(32)తోపాటు వాహనంలో ప్రయాణిస్తున్న అతడి తల్లి వల్లియమ్మ(60), భార్య ప్రియ(21), మరదళ్లు రేణుక(17), రేవతి(17), పిన్నమ్మ రాధ (36), రాధ కుమార్తె అభినయ(10)లకు తీవ్రగాయాలయ్యాయి. రెండు వాహనాల ముందరి భాగాలు బాగా దెబ్బతిన్నాయి. పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఈ ప్రమాదం సంభవించడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని 108లో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హరికృష్ణ మృతి చెందాడు. వల్లియమ్మ, రేవతి పరిస్థితి విషమంగా ఉండడంతో చిత్తూరులో ప్రథమ చికిత్స అనంతరం వేలూరు సీఎంసీకి తరలించారు. పూతలపట్టు ఏఎస్‌ఐ వడివేలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నవ్వినందుకు చితకబాదాడు

కళ్లల్లో పెప్పర్‌ స్ప్రే కొట్టి రూ.30లక్షలు దోపిడీ

తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య

ప్రొఫెసర్ల వేధింపులతో బలవన్మరణం

మహిళ మెడ నరికి హత్య

వెట్టి చాకిరి కేసులో 17 ఏళ్ల జైలు

సినీ హీరో రాజశేఖర్‌కు గాయాలు

మత్తులో ట్రావెల్స్‌ డ్రైవర్, కండక్టర్‌ 

కుమారుడి పెళ్లి వేడుకలో.. తండ్రి హత్య!

మొండం లేని మహిళా మృతదేహాం లభ్యం

నా భార్యను మోసం చేస్తున్నాను.. అందుకే ఇలా!

మహిళ కేకలు వేయడంతో పట్టుబడిన దొంగలు

దోపిడి దొంగల బీభత్సం; భారీ చోరి

ప్రియుడి కోసం రూం: వివాహిత దారుణ హత్య

7లక్షలకు 13 ఏళ్ల కూతురిని అమ్మేశాడు!

రూ.లక్షకు.. రూ.5లక్షలు

హన్నన్నా...ఆర్‌ఐఓ గారూ?

ప్రాణాలు తీసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

ముందు లిఫ్టు అడిగి.. వెనకాలే ఆటోలో వచ్చి..!

చోరీకి యత్నించి.. పట్టుబడి!

పోలీసులకు సవాల్‌

కన్నపేగునే కబళించారు!

సుత్తితో తలపై మోది భార్యను హతమార్చాడు

అసలేం జరిగింది? 

లోకోపైలెట్‌పై కేసు

ఇలా పట్టుబడతాడు.. అలా బయటకొస్తాడు

స్క్రిప్ట్‌ ప్రకారమే జయరాంరెడ్డి ఆత్మహత్యాయత్నం

యువతి దారుణ హత్య

తమ్ముడిని రక్షించి ప్రాణం విడిచిన అన్న

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తీవ్రవాదిగా మారిన సమంత..!

రామజోగయ్యశాస్త్రికి గురజాడ పురస్కారం

అలాంటి పాత్రలు వదులుకోను

వెబ్‌లో అడుగేశారు

కొత్తవారికి ఆహ్వానం

అందమైన ప్రేమకథ