ఎస్‌ఆర్‌ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

17 Feb, 2020 15:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలేఖ్య అనే యువతి రోడ్డు దాటుతుండా బైక్‌ ఢీ కొట్టింది. ఈ క్రమంలోనే వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఆమెపై నుంచి దూసుకెళ్లింది. కారు చక్రాల మధ్యలో ఆమె ఇరుక్కుపోవడంతో కొంత దూరంపాటు ఈడ్చుకుంటూ వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన అలేఖ్యను స్థానికులు హుటాహుటినా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సమీపంలోని సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయింది.


మరిన్ని వార్తలు