ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది దుర్మరణం

5 Jun, 2018 06:44 IST|Sakshi

సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం హర్దోయి వద్ద ట్రక్కు ట్రాక్టర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు